-రైతుల రుణాలు మాఫీ చేయని మోదీ… తన మిత్రులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేశారు
– జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ
కొడంగల్: మీ అందరిపై రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో వారిని కలిసినప్పుడు అర్ధమైంది.ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేశారు.అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో స్వేచ్ఛ, సమానత్వం , సమాన అభివృద్ధి కరువయ్యాయి. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంది పేదలు.. నిరుద్యోగుల సమస్యలు తీరలేదు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. పదేళ్లు గడిచాయి.. నిరుద్యోగుల సమస్యలు తీరాయా? కేసీఆర్ రైతుల కష్టాలు తీర్చారా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ వర్గానికైనా మేలు జరిగిందా? ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకున్నారు తప్ప ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదు.
ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు.. ఆ డబ్బు ఎక్కడిది ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి.పదేళ్లుగా అటు దేశంలో మోదీ సర్కారు.. ఇటు రాష్ట్రంలో బీఆరెస్ సర్కారు అధికారంలో ఉన్నాయి.మోదీ దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు. రైతుల రుణాలు మాఫీ చేయని మోదీ… తన మిత్రులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేశారు.బీఆరెస్, బీజేపీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి.
ధరణి పేరుతో మీ భూములను బీఆరెస్ సర్కారు గుంజుకుంది.దొరల తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేం లేదు. దొరల తెలంగాణకు చరమగీతం పాడి.. ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. దొరల ప్రభుత్వం కావాలో… ప్రజల ప్రభుత్వం కావాలో తేల్చుకోండి. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురండి.