– కక్ష సాధింపు లో భాగమే ఈ కార్ రేసు కేసు
మిస్ వరల్డ్ పోటీలు పెట్టి ఒక్క సంస్థ అయిన తెచ్చారా?
– మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్
హైదరాబాద్: రాష్ట్రంలో మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో మీపై వస్తున్న వ్యతిరేకతను డ్రైవర్ట్ చేయడానికి, కేటీఆర్ పై కక్ష సాధించటానికి ఈ బేకార్ కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తేవాలని, పెట్టుబడులు తేవాలని కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిర్వహిస్తే, దాన్ని మధ్యంతరంగా నిలిపివేసి.. అందులో ఎదో అక్రమం చేశారని అక్రమ కేసు పెట్టారు. కేటీఆర్ ఆనాడే చెప్పారు ఇందులో ఉన్నదేమిలేదు ఇది ఉత్తి లొట్టపీసు కేస్ అని.
అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ కొంత కాలం ప్రజలను మభ్య పెట్టడానికి ఈ ఫార్ములా కేస్ ని వాడుకుంటున్నాడు. పెట్టుబడి పెడితేనే కదా పెట్టుబడులు వచ్చేవి? అసలు రేవంత్ రెడ్డి కి తెలిస్తే కదా పెట్టుబడులు ఎలా తేవాలని? ఇతర దేశాలు టూర్లు తిరిగి ఇదిగో పెట్టుబడులు, అదిగో పెట్టుబడులు అని పేపర్లలో కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ వెయ్యడం ద్వారా తెలంగాణ ఈ స్థాయికి రాలేదు. నిరంతరం ఎంతో కష్టపడి, ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే కదా తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మీలాగా మిస్ వరల్డ్ పోటీలు పెట్టి, వారితో అసభ్య కరంగా ప్రవర్తించి హైదరాబాద్ ఖ్యాతిని దిగజార్చలేదు.
మిస్ వరల్డ్ పోటీలు పెట్టి ఒక్క సంస్థ అయిన తెచ్చారా… పోటీలు నిర్వహించడం చేతకాక తెలంగాణాకు ఉన్న పేరు పోగొట్టారు. పార్ములా ఈ రేస్ లో బాగంగా ఎన్నో దేశాలను మన తెలంగాణ వైపు చూసేలా చేసి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ఆట దాన్ని ప్రముఖులు, క్రీడాకారులు మరియు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది వీక్షిస్తారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొంటారు. దానివల్ల హైదరాబాద్ ఖ్యాతి పెరిగి పెట్టుబడులు పెరుగుతాయని ఈ కార్ రేస్ పోటీలు నిర్వహిందాము. మీ నాయకుడు రాహుల్ గాంధీ, సచిన్ టెండూల్కర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్టం అన్నారు.
ప్రపంచంలోనే టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది అంటే ఆ ఘనత మా ప్రభుత్వానిదే. తెలంగాణలో IT ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆ ఘనత కేటీఆర్ దే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు తీసుకురావడం చేతకాక ఉన్న బెట్టుబడులు పోతున్నాయి. లై డిటెక్టర్ కు కూడా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరితే స్వీకరించే దైర్యం చేయలేదు ఎందుకు?ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రదారంపై అసెంబ్లీలో చర్చ జరపాలని స్పీకర్,సీఎంను లేఖ ద్వారా కోరారు.
అప్పుడెందుకు చర్చ పెట్టలేదు? ఇప్పుడెందుకు ముందుకు తెచ్చారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ ని కట్టడి చేయాలని ప్రయత్నంలో భాగమే ఈ ఫార్ములా కేసు. అసెంబ్లీలో చర్చ పెడితే కాంగ్రెస్ చేస్తున్నది తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందని చర్చ జరపలేదు. జుబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయానికి దాదాపు చేరువలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీని ఓడించడానికి హుటాహుటిన అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి, ఎంఐఎం పార్టీ దగ్గరికి కాళ్లబేరానికి వచ్చి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో దావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా విజయం సాధించారు. అదేవిధంగా స్థానిక సంస్థలలో విజయం సాధిం చడానికి ఈ కారు రేస్ కేసు ను తెరమీదకు తీసుకు వచ్చారు . తద్వారా కేటీఆర్ ప్రతిష్టను మస్కపరచడానికి ప్రయత్నిస్తున్నారు. మార్కుల గ్రామం నుండి మహానగరం వరకు ప్రతి ఒక్కరికి కెసిఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ ఏ విధంగా తెలుసో అదేవిధంగా KTR అంటే IT, IT అంటేనే కేటీఆర్ అని మారుమూల గ్రామం నుండి అమెరికా వరకు తెలుసు. ఈ బ్రాండ్ ప్రతి ఒక్కరికి తెలుసు.