*విద్యార్ధులపై జగన్ చేసిన దాడి తాలుకా గాయాలు
*జగన్, వెల్లంపల్లి పై దర్షిత్ విమర్శనాస్త్రాలు
*మే13న జరగబోయే ఎన్నికల్లో ఓటుతో జగన్ పై దాడి
*యువత ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశం లోనే ప్రధమ స్థానం
*ఐదేళ్లుగా విద్యార్థుల జీవితాలతో జగన్ ఫుట్ బాల్
*ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై జగన్ కన్ను
*ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలుపుదల, విద్యార్ధులు అప్పులపాలు
*జగన్, వెల్లంపల్లి డ్రామాలపై విరుచుపడ్డ టి.ఎన్.ఎస్.ఎఫ్
టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్
*జగన్ గులకరాయి డ్రామా పై మీడియా సమావేశం
విజయవాడ : విద్యార్ధులకు అండగా వుంటాను. మీ పిల్లలను చదివిస్తాను. ఉద్యోగస్తులను చేస్తా అంటూ మాయ మాటలు, కోడి కత్తి డ్రామ ఆడి అధికారంలో వచ్చిన జగన్… అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్ధి లోకంపై దాడికి తెగబడ్డాడు. గత ఐదేళ్లుగా విద్యార్ధుల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. విద్యార్ధులకు అయిన గాయాలు పట్టించుకోని జగన్…కనిపించని గులకరాయి దెబ్బకి 13 రోజులైన స్టిక్కర్ లు అంటించుకుని డ్రామాలు ఆడుతున్నాడు. బాలింతలు కూడా పన్నెండు రోజుల్లో కోలుకుంటారు.ఇన్ని రోజులైన కనిపించని గులకరాయి గాయం జగన్ కి ఇంకా తగ్గలేదా? ఎలక్షన్స్ అయ్యే వరకూ స్టికర్ తొలగించరా అంటూ టి.ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్, వెల్లంపల్లి గులకరాయి డ్రామాపై, గత ఐదేళ్లుగా విద్యార్ధులకు జగన్ చేసిన మోసాలపై టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవనం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శిత్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మీడియా సమావేశంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు తగలని గాయాలకు కనిపించే కట్లు కట్టుకొని వారి నిరసన, వ్యతిరేకత తెలియజేశారు.
ఈ మీడియా సమావేశంలో పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ “ఈ రోజు మా విద్యార్థి లోకంపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కనిపించని ఓ గులకరాయి తగిలితేనే పన్నెండు రోజులుగా నాటకాలు ఆడుతున్న పరిస్థితి వుంది. మరి గత ఐదు సంవత్సరాలు గా జగన్ విద్యార్దుల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాము. దాని తాలుకా గాయాలే ఇవి అని మీకు తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఏడాది ఏదోక విధంగా విద్యార్దుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి..
ముందుగా స్కూల్ విద్యార్ధులపై ఒకరకమైన దాడి..ఎలా అంటే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, స్కూల్ నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమానికి గండి కొట్టిన పరిస్థితిని చూశాం. అదే విధంగా ఇంటర్ విద్యార్ధులు, డిగ్రీ విద్యార్ధుల విషయానికి వస్తే వాళ్ల పై మరో రకమైన దాడి జరిగింది. ఎయిడెడ్ విద్యా విధానంలో అత్యంత నాణ్యమైన విద్యను అందుకుంటున్న విద్యార్ధులపై దాడి జరిగింది.
ఈ బకాసురుడు ఎయిడెడ్ విద్యా సంస్థల భూములపై కన్నేసి వాటిని మింగేయాలనే ఆలోచనతో ఆనాడు ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి ఆ భూములు అప్పగించాలని కోరితే… కొన్ని ఎయిడెడ్ విద్యా సంస్థల యజమానులు అప్పగించారు..కొన్ని కాలేజీలు అప్పగించలేదు. దీంతో విద్యార్ధుల ఫీజులు భారీగా పెరిగిపోయాయి. నాణ్యమైన విద్య లోపించింది. అక్కడొక దాడి చేశాడు. అదే విధంగా ఇంజినీరింగ్ విద్యార్ధులకు పీజ్ రీయింబర్స్‌మెంట్ నిలుపుదల చేసి వారికి వెన్నుపోటు పొడిచి ఓ దాడి చేశాడు.
అలాగే పిజి చదివే విద్యార్దులకు పూర్తిగా పీజ్ రీయింబర్స్‌మెంట్ రద్దు చేసి ఓ దాడి చేశాడు. అంబేడ్కర్ విదేశీ విద్య అనే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల అభ్యున్నతి కోసం చంద్రబాబు అమల్లోకి తీసుకువస్తే, ఈ పెత్తందారి మనస్తత్వం గల జగన్ ఆ పథకాన్ని రద్దు చేసి ఆ సామాజిక వర్గాల విద్యార్ధులపై దాడి చేశాడు.
ఇలా విద్యార్ధులపై అనేక రకాల దాడులు చేసుకుంటూ ఐదేళ్ల కాలాన్ని వెల్లబుచ్చినటువంటి జగన్ రెడ్డి 12 రోజుల క్రితం తన పై దాడి జరిగిందని చెప్పి…కనిపించని గులకరాయి సాకుగా చూపించి..ఈ రోజు వరకు కూడా ఒక కట్టుకొని తిరుగుతా వున్నాడు. రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు. బాలింతరాలైన సరే 12 రోజుల తర్వాత తన పనులు తాను చేసుకుంటుంది. అయినా జగన్ కనిపించని ఓ చిన్న గులకరాయి తగిలిందని హాస్పటల్ కి వెళ్లి సర్జరీ డ్రెస్ వేసుకున్నాడు .అక్కడ కుట్లు కూడా వేసిన పరిస్థితి లేదు.
కేవలం ఒక స్టిక్కర్ అంటించారు. ఈ సందర్బంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఎన్నికల వరకు జగన్ రెడ్డి ఆ స్టిక్కర్ తీయడు. స్టిక్కర్ పెట్టుకొని సిక్టర్ సిఎం..సిక్టర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. ఈ సిక్టర్ సీఎంకి తోడుగా విజయవాడలో ఇంకో దుర్మార్గుడు వున్నాడు. కుడి కంటికి, ఎడమ కంటికి స్టికర్లు , కాటన్ మార్చుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దండుపాళ్యం ముఠా అంతా డ్రామాలు ఆడుతూ ఓట్లు అడగటానికి వస్తున్నారు.
ఈ సందర్బంగా విద్యార్థి లోకం తరుఫున ఒకటే తెలియజేస్తున్నాము. మీ మీద భౌతిక దాడులు చేయలేము కానీ, ఓటు ద్వారా రేపు మే13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో దాడి చేసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విద్యార్ధులందరూ సన్నద్దంగా వున్నారని తెలియజేస్తున్నాను. విద్యార్ధులు, యువతకు ఈ జగన్ రెడ్డి చేసిన అన్యాయం అంత ఇంత కాదు. లక్షకు పైగా వున్న బ్యాక్ లాగ్ పోస్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్ రెడ్డి వాటిని భర్తీ చేయలేదు.
పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రతి ఏడాది విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ హామీ నెరవేర్చలేదు. విద్యార్ధులకు గత ఐదేళ్లుగా అన్యాయం చేసిన ఈ దుర్మారపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే వుంది. గతంలో చంద్రబాబు 6 లక్షల ఉద్యోగాలు చూపించి యువతకు ఒక దిక్సూచిలా నిలిచారో..రేపు ఎన్డీయే కూటమి అధికారంలో రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించటానికి సిద్దంగా వున్నారు. జగన్ రెడ్డి నిలిపివేసిన నిరుద్యోగ భృతిని కూడా మళ్లీ అమలు చేయబోతున్నారు.
జగన్ రెడ్డి టైమ్ అయిపోయింది. విద్యార్ధులు, యువతతో పెట్టకుంటే రాజ్యాలు కూలిపోయాయి., రాజ్యాధికారాలు మారిపోయాయి. రేపు నిన్ను అధికారం నుంచి దించేది మోసపోయిన విద్యార్ధులు, యువత అనే సంగతి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 వేల మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున యువత ఆత్మహత్య చేసుకుంది. రైతుల ఆత్మహత్య గురించి తెలుసు. యువత ఆత్మహత్యల విషయంలో రాష్ట్రం దేశంలోనే సింహాభాగంలో వుంది.
ఈ పరిస్థితి మన రాష్ట్రంలో వుండటం మనకే కాదు రాష్ట్రానికి కూడా సిగ్గు చేటు..అనంతపురంలో శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఉద్యోగం దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ల కుటుంబానికి జగన్ రెడ్డి ఏమని సమాధానం చెబుతాడు. జగన్ మోహన్ రెడ్డి సిద్దం సిద్దం అంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్నాడు. జగన్ రెడ్డి దేనికి సిద్ధం, ఉద్యోగాలు ఇవ్వకపోవటానికి సిద్దం, యువత ఆత్మహత్యల కారణానికి నువ్వు సిద్దం, రేపు నువ్వు ఓడిపోవటానికి కూడా నువ్వు సిద్ధంగా వుండాలని”” తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ సభ్యులు కె.ప్రవీణ్, మనీష్ వర్మ పాల్గొన్నారు.