హత్య కేసులో అరెస్ట్ అయ్యి తమ నెల్లూరు జైలుకు ఇటీవలే పిన్నెల్లి బ్రదర్స్ వచ్చారు. 50 రోజుల క్రితం వరకు బయట. అనుచరులతో.. కొట్టేసి, అమ్మేసిన అగ్రిగోల్డ్ భూముల నుండి కల్తీ లిక్కర్ లావాదేవీల లెక్కలు చూసుకుంటూ బిజీ బిజీగా ఉండేవారు.
ఇప్పుడు జైల్ బ్యారక్ లో ఖాళీగా ఒంటరిగా ఉంటే.. ఏవేవో చెడు ఆలోచనలు వస్తాయి. అధికారం శాశ్వతం అని స్కాములకు బోనస్ గా కొవ్వెక్కి చేసిన గత పాపాలు తలచుకుంటూ వుంటారు. ఫోన్లలో డిలీట్ చేసినా త్రవ్వి తీసిన టెక్నాలజీ గురించి ఆశ్చర్యపోతూ తమను తాము తిట్టుకుంటూ ఉంటారు.
అలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిటాలరవి హంతకుడు మొద్దు శీనును జైల్లోనే చంపేశారు, నెల్లూరు జైల్లో తమకేం జరిగినా వైకాపాకు సానుభూతి వస్తుంది అని “ఆలోచించినట్లున్నారు”. బెదిరిపోయి, బెజవాడ జైలుకు మమ్మల్ని పంపండి మహాప్రభో అని కోర్టును వేడుకున్నట్లున్నారు.
8153, 8154 జోగి బ్రదర్స్, మమ్మల్ని అరెస్ట్ చేసి 50 రోజులు అయింది కాబట్టి బెయిల్ ఇవ్వండి అని అడిగారు.దీనికి కోర్టు ఒప్పుకోలేదు, తిరస్కరించింది.
బెయిల్ రాకున్నా బెజవాడ ట్రాన్స్ఫర్ కు కోర్టు ఒప్పుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. వీళ్ల ఇబ్రహీంపట్నం చెడ్డీ దోస్తులు, కల్తీ పార్టనర్స్ అద్దేపల్లి బ్రదర్స్ మాత్రం.. నెల్లూరు జైలే సుఖం అనుకుని సర్దుకున్నారు.
విజయవాడ జైల్లో చెవిరెడ్డి నుండి బడా బడా లిక్కర్ స్కాం నిందితులు కిక్కిరిసిపోయి ఉన్నారు కాబట్టి, ఇక్కడే నయం అని అద్దేపల్లి బ్రదర్స్ అనుకున్నట్లునారు.
-చాకిరేవు