Suryaa.co.in

Andhra Pradesh

ఆసుపత్రిలో బాధితులకు డబ్బుల కవర్లు ఇచ్చి బాబును తిట్టాలని చెప్పారు

– డబ్బుల కవర్లు ఇస్తున్న దృశ్యాలు ఆసుపత్రి సిసి టీవీ కెమేరాల్లో రికార్డు అయ్యాయని చెప్పిన మంత్రి ఆనం
– జగన్ స్విమ్స్ పర్యటన, క్షతగాత్రుల పరామర్శ అంశంపై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

అమ‌రావ‌తి: పరామర్శ పరుతో జగన్ నిన్న దుష్టచతుష్టయ యాత్ర సాగించాడు. తిరుమల దేవస్థానాన్ని భ్రష్టుపట్టించిన నలుగురే నిన్న జగన్ తో ఉన్నారు. జగన్ అసుపత్రికి వెళ్లేసరికి ఆసుపత్రిలో 18 మందికి ఉన్నారు. జగన్ వెంట ఉన్న దుష్టచతుష్టయంలోని ఒకరు జగన్ కంటే ముందు ఆసుపత్రిలోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో బాధితులకు డబ్బుల కవర్లు ఇచ్చి…చంద్రబాబు కు వ్యతిరేకంగా జగన్ వద్ద మాట్లాడమని చెప్పారు.

తెలుగు దేశంపై, చంద్రబాబు నాయుడు పై వ్యతిరేకంగా చెప్పండని క్షతగాత్రులకు కవర్లు ఇచ్చారు…దీనికి వైసీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా? 5 ఏళ్లు పాలన చేశారు. కానీ పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై, సిఎంపై ఆరోపణలు చేయమని డబ్బుల కవర్లు ఇచ్చి వస్తారా?

మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యులు ఈ పనిచేశాడు..ఇంకా ఆ దుష్టచతుష్టయాన్ని పెట్టుకుని జగన్ ఇంకా ఊరేగుతున్నాడు. ఆస్పత్రిలో ఉన్న సిసి కెమేరాల్లో వైసీపీ నేతలు ఇచ్చిన తెల్లకవర్ల దృశ్యాలు రికార్డు అయ్యాయి. కవర్లు ఇచ్చి ముఖ్చమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన విషయాన్ని అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది కూడా గుర్తించారు. ఏం జీవితాలు అయ్యా మీవి? ఈ మానవ సమాజంలో ఉండదగిన వాళ్లా మీరు?

మృగాల మధ్య పెరగాల్సిన మీరు ఇవాళ రాష్ట్ర ప్రజల కర్మగాలి సమాజంలో తిరుగుతున్నారు. ఓ పక్క చనిపోయిన వాళ్లు…..మరో పక్క క్షతగాత్రులు ఉంటే….ఆ శవాల మధ్య పేలాలు వేరుకున్నారు. జగన్ నిన్న తిరుమల నెయ్యి గురించి మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో అన్ని దేవాలయాల్లో తక్కువ క్వాలిటీ నాణ్యత వాడి ప్రసాదాలను అపవిత్రం చేశారు.

నెయ్యి కల్తీ విషయాన్ని బయటపెట్టిందే మా ప్రభుత్వం. దీనిపై జగన్ ఏం మాట్లాడుతాడు? ప్రసాదాలు, అన్న ప్రసాదాలు క్వాలిటీ ఎంత మెరుగుపరిచామో భక్తులను అడిగి జగన్ తెలుసుకోవాలి. భక్తుల మనోభావాలు కాపాడుతాం. సామాన్య భక్తులకు శ్రీవారిని చేరువ చేస్తాం.

LEAVE A RESPONSE