Suryaa.co.in

Andhra Pradesh

ఇది ప్రజా ప్రభుత్వం

– రేబాల ప్రాంతంలో కాలువలలో పూడిక తీతకై 2 ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేస్తా
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

బుచ్చిరెడ్డి పాళెం : గత ప్రభుత్వంలో నాయకుల్లా అక్రమ గ్రావెల్ తవ్వకాలు అక్రమ ఇసుక అమ్మకాలకు టిడిపి నాయకులు దూరంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు.

“ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాళెం మండలం రేబాల గ్రామంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఇల్లిల్లూ తిరిగి 100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు పాలనలో అమలు చేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించారు. అనంతరం తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరు- వివాద రహిత కోవూరుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అవినీతి అక్రమాలను సహించనన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇం టింటికెళ్లి 100 రోజుల్లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలు వివరించాలని కోరారు.

స్థానికుల అభ్యర్ధన మేరకు విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో మరో రెండు వారాలలో రేబాల ప్రాంతంలో కాలువలలో పూడికలు తీసేందుకు రెండు ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజానీకం కోసం నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏటూరి శివరామ కృష్ణా రెడ్డి, రేబాల సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎం వి శేషయ్య, బత్తుల హరికృష్ణ, సూరా శ్రీనివాసులు రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, సయ్యద్ రియాజ్, బుచ్చి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎంపిడిఒ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE