Suryaa.co.in

Telangana

ఇది పూర్తిగా మత పరంగా జరిగిన హత్య

– ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే ఈ హత్య
– అభ్యుదయ వాదులు, అభ్యుదయ మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

సరూర్ నగర్ లో బుధవారం రోజు రాత్రి నాగరాజు అనే దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేయడాని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. వికారాబాద్ కు చెందిన నాగరాజు, ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత 4 నెలలు కాపుకాసి హత్య చేయడం ఒక కిరాతకమైన చర్య. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే ఈ హత్య జరిగింది. ఈ హత్య చేసిన వ్యక్తుల ను వెంటనే గుర్తించాలి; వారి వెనుక ఉన్న శక్తులను, సంస్థలను బయట పెట్టాలని బిజేపి డిమాండ్ చేస్తున్నది, ఇది పూర్తిగా మత పరంగా జరిగిన హత్య గానే బిజేపి భావిస్తోంది. ఇంత కిరాతకమైన సంఘటన పట్ల సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని బిజేపి ప్రశ్నిస్తున్నది.

లవ్ జిహాద్ పేరుతో మతోన్మాద సంస్థలు ప్రేమ పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని బిజేపి విమర్శిస్తే, ఈ సెక్యులర్ వాదులు బిజేపి ని మత ఉన్మాదులు అంటున్నారు. మరి ఈ సంఘటన ఏ కోవకు చెందినదో కుహనా మేధావులు ప్రజాలకు చెప్పాలి. భవిష్యత్తులో ఏ ముస్లిం యువతి కూడా హిందూ యువకుడిని పెళ్లి చేసుకోకుండా భయ బ్రాంతులకు గురి చేసేందుకే ఇంత కిరాతకమైన హత్యకు పాల్పడ్డారు.

గతంలో మిర్యాలగూడ లాంటి సంఘటనలు జరుగితే గొంతెత్తి అరిచిన అభ్యుదయ వాదులు, అభ్యుదయ మీడియా ఎందుకు ఈరోజు నోరు విప్పడం లేదు. ఇటువంటి సంఘటనలు తెలంగాణలో ఎన్నో జరుగుతున్న వెలుగులోకి వస్తున్నవి ఒకటి, రెండు మాత్రమే.

హిందూ యువతి, ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంటే, మతం మార్చుకుంటూ హిందూ కుటుంబాలను వెక్కిరిస్తుంటే, ఆ అవమానం భరించలేక హిందూ కుటుంబాలు ఆత్మ హత్యలకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆటువంటి సంఘటనలపట్ల కుహనా మేధావులు మౌనంగా ఉంటున్నారు.
ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోవాలి.

ఇటువంటి కిరాతకమైన సంఘటనలను ఖండించాలి, నిరసన వ్యక్తం చేయాలి. ఇటువంటి సంఘటనలను ప్రోత్సాహిస్తున్న మతోన్మాద శక్తులను, వాళ్ళకు మద్దతు ఇస్తున్న సంస్థలను, వాటికి సహకరిస్తున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను నిలదీయాలి. ఇటువంటి శక్తులను సమాజం నుండి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైనది.

LEAVE A RESPONSE