– మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని ఎక్స్ వేదికగా ఎండగట్టిన కేటీఆర్
హైదరాబాద్: మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కల. ఆ కలను నిజం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం ₹545 కోట్లు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. మూసీ నదిపై వంతెనల నిర్మాణం ద్వారా హైదరాబాద్ వాసుల రాకపోకలను సులభతరం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం జనవరి 2022లో రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణానికి మంజూరు చేసింది.
ఈ వంతెనల పొడవు సుమారు 150-200 మీటర్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదు. నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం – ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయి. ఇది పనికిమాలిన ప్రభుత్వం, పనికిమాలిన పాలన