( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆకాశమంత అరుగులేసి, భూదేవంత సభలు పెట్టిన ఏపీ సర్కారు.. మహిళా దినోత్సవం పేరుతో హడావిడి చేసి, మహిళల త్యాగాలను ఏకరువు పెట్టిన రోజే జరిగిన అమానవీయ ఘటన ఇది. ఈ చిత్రంలో కనిపించే మహిళ చీర ఊడదీసి మరీ లాక్కెళుతున్న వైనం.. మహిళా దినోత్సవం నిర్వహించే పాలకులు సదరు మహిళామతల్లులకు ఇస్తున్న బహుమతా? లేక ఏ దినోత్సవమయినా మా రూటే సెపరే టని పోలీసులు ఇచ్చే సంకేతమా? నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దఅన్నలూరు గ్రామకంఠం భూమిలో అక్రమ లే అవుట్‌తో రోడ్డు వేసిన వైసీపీ నేత సిద్దారెడ్డి వీరారెడ్డిని ఈ మహిళ అడ్డగించి, నిలదీసిందట. దానితో ఆ లీడర్ సారుకు కోపమొచ్చి పోలీసులకు పురామయిస్తే, మహిళా పోలీసులు ఆ మహిళకు మర్యాదలు చేసి మరీ ఇలా తీసుకువెళ్లారట. పోలీసుల అమానవీయానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన ఈ ఫొటో, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. హోంమంత్రి సుచరిత గారూ.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారూ… మహిళలపై ఏం జరుగుతోందో… మీకు అర్ధమవుతోందా? మరి తీయండి ఆదేశాల కొరడా.. ఝళిపించండి చర్యల కొరడా!