– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: ప్రజా సమస్యలు భే ఖాతార్… దృష్టి మళ్లింపు రాజకీయాల్లో, బెదిరింపు పాలనతో రాకాసి రెడ్డి నిరంకుశ ప్రభుత్వం కుళ్ళిపోయింది… యూరియా కావాలంటే రైతుకు చెంపదెబ్బలు, లాఠీలు!”.. బీసీ రిజర్వేషన్లు అంటే బిల్లులు, ఆర్డినెన్స్లతో మోసం, దగా! అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి కాళేశ్వరం కేసులు, ఘోష్ కమిషన్లు, సీబీఐల డ్రామాలు అడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గ్రూప్–1 కేసులో నిరుద్యోగులకు టోపి పెట్టి, కోర్టులో దెబ్బతిన్న వెంటనే ఈ-కార్–బేకార్ కేసులు, ఏసీబీ గడబిడలు.. మూసి, ఫ్యూచర్ సిటీ అంటూ సరికొత్త దోపిడీకి తెర తీసిండ్రు.. వాగ్దానాల అమలులో వైఫల్యం – కేవలం బూతులతో కోతలరెడ్డి చేస్తున్న రోత పాలన! ఇచ్చిన హామీలను మరచిపోయి సమస్యలను పక్కదారి పట్టిస్తు రాకాసి రెడ్డి చేస్తున్న ప్రజా ద్రోహ పాలన..ప్రజా హాని పాలన… కుతంత్రాల్లో కుళ్లిపోయిన మీ నిగ్గు ప్రజలు తేల్చే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ప్రజల్ని ఎల్లకాలం పనికిరాని మాటలతో మోసం చేయలేరు.. తస్మాత్ జాగ్రత్త!! కుట్రలతో మమ్మల్ని ఆపలేరు – ప్రజల ఆశీర్వాదంతో మారోజులు మళ్ళీ వస్తాయి దాసోజు శ్రవణ్ అన్నారు.