-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యరాహిత్యంగా వ్యవహరించటం సరికాదు
-ఉద్యోగులు సమ్మెకి దిగితే నష్టపోయేది ప్రజలే, తక్షణమే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
– పర్చూరి అశోక్ బాబు
ఉద్యోగులు నిన్న చేసిన నిరసన ఇంతవరకు దేశంలో ఏరాష్ట్రంలోనూ జరగలేదని ఉద్యోగులు ఇంత పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించటం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నిన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడిన తీరు చూస్తుంటే తప్పు ముఖ్యమంత్రిదా? అధికారులదా అన్నది ఉద్యోగులు నిర్ణయించుకోవాలి. ఐఆర్ 27 శాతం నుంచి 23 తగ్గిస్తే జీతాలు తగ్గుతాయని ఉద్యోగులు చెబుతుంటే.. ప్రధాన కార్యదర్శి మాత్రం దానిపై నిర్లక్ష్యంగా మాట్లాడటం దురదృష్టకరం. ఉద్యోగుల ఉద్యమంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఏ జరుగుతందో ఆయన నివేదిక తెప్పించుకోవాలి. ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జాయింట్ స్టాప్ కౌన్సిల్ చైర్మన్ కి నోటీసులిస్తే దానిపై స్పందించి ఉద్యోగుల్ని చర్చలకు పిలవటం ఆయన బాధ్యత. కానీ చర్చలకు రావొచ్చు అని బాధ్యరాహిత్యంగా మాట్లాడుతున్నారు. మరో వైపు సజ్జల రామకృష్ణారెడ్డి ముగిసిన అధ్యాయం అని మాట్లాడుతున్నారు. అసలు ఆయనెవరు మాట్లాడడానికి? సజ్జల మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడినట్టే. ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ లు ఉద్యోగులకు చాలా ఎక్కువ జీతాలిస్తున్నామని మట్లాడం సరికాదు. ఐఎయస్ లకు తక్కువ జీతాలొస్తున్నాయా? ప్రభుత్వం బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నట్టు చిత్రీకరించి ప్రజల్లో ఉద్యోగుల ఉద్యమం పట్ల సానుకూలత లేకుండా చేసేలా ప్రయత్నిస్తోంది. కానీ దీన్ని ప్రజలు నమ్మటం లేదు.
ఉద్యోగులు జీతాల కోసమే సమ్మెలు చేయరు. సమైక్యాంద్ర కోసం కూడా ఉద్యోగులు సమ్మె చేశారు. అధి సామాజిక భాద్యత. రాష్ట్రంలో వరదలు, విపత్తులు వచ్చినపుడు ముందుగా వెళ్లేది ఉద్యోగులే. సామాజిక బాధ్యత లేకుండా ఉద్యోగ వ్యవస్ధ ఉందని వక్రీకరించటం అసాధ్యం. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్దిలో తెలంగాణ కంటే ముందు వరుసలో ఉన్నామంటే దానికి చంద్రబాబు నాయుడు విజన్ తో పాటు ఉద్యోగుల పనితీరు కూడా కారణం. హుద్ హుధ్ తుపాన్ లో ఉద్యోగులు రాత్రింబగళ్లు పనిచేశారు. ఉద్యోగులు కష్టపడ్డారు కాబట్టే రాష్ట్ర సంపద పెరిగింది. ఈ సంపదను 43 శాతం పీఆర్సీ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు పంచారు. 20 శాతం హెచ్. ఆర్. ఏ , ఫించన్ స్పెషల్ కోటా, మహిళలకు సెలవులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే. వాలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపటం వల్ల ఏడాదికి రూ. 6,200 వేల కోట్ల అధనపు బారం పడింది. దానికి ఉద్యోగులదా బాధ్యతా? ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించమంటే ఆర్దిక పరిస్థితి బాగోలేదనంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ది పనులు, పెట్టుబడులు లేకుండా ఆర్దిక వ్యవస్ధ ఎలా బాగుంటుంది? ఉద్యోగుల్ని దొంగలు, దోషులుగా చూస్తున్నారు కాబట్టే ఉద్యోగులకు ప్రభుత్వంపై కోపం వచ్చింది. నిన్న జరిగిన ఉద్యమంలో పోలీసులను తప్పు పట్టడం, సరికాదు. పోలీసులు ఉద్యోగులు కాదా? పోలీసులకు జీతాలు తగ్గిస్తామంటే వాళ్లు ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తారు?
ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు నాపై అక్రమ కేసు బనాయిస్తే.. భయపడతామా? ప్రతిపక్షపరాటీ ఎమ్మెల్సీ, మాజీ ఉద్యోగ సంఘ నేతనైనా నాపైనే కేసు పెట్టి .. ఇప్పుడు ఉద్యమం చేసేవాళ్లను ఇన్ డైరెక్టర్ బెదిరిస్తున్నారు. ఉద్యోగులకు ఐఆర్. 27 కంటే ఎక్కువ ఇవ్వకపోయినా దాన్నే కొనసాగిస్తే సమస్య ఇంత ఉండేది కాదు. టీడీపీ హయాంలో రెండు డీఎస్సీలు ఇచ్చాం. వైసీపీ పాలనలో వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏం ఇచ్చారు? ఏపీలో కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్తితిలేదు, ఉన్న ఉద్యోగుల్ని సంతృప్తిపరిచే పరిస్తితి లేదు. మాకు కొత్త జీతాలొద్దు, పాత జీతాలే కావాలని ఉద్యోగులు ఎందుకు అడుగుతున్నారో ఐఏయస్ చదువుకున్న చీప్ సెక్రటరీకి అర్ధం కాలేదోమో గానీ ఆటో డ్రైవర్లకు కూడా అర్దమైంది. సమ్మె అనివార్యమ్యేలా కన్పిస్తోంది. సమ్మె జరిగితే గ్రామ సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, అందరూ సమ్మెల్లోకి వస్తారంటున్నారు. సమ్మె జరిగితే మీరు తాడేపల్లిలో రాజప్రసాదంలో కూర్చుంటారు, ఉద్యోగులు రోడ్లపై కూర్చుంటారు. దీంతో నష్టపోయేది ప్రజలే. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు టీడీపీ మద్దతు ఎల్లప్పుడూ ఉటుంది. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. జాయింట్ స్టాప్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న సీఎస్ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలి. ముఖ్యమంత్రి స్ధాయిలో చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారమవుతుందని అశోక్ బాబు అన్నారు.