అసలు ఆంధ్రప్రదేశ్ లో లేని సినిమా ఇండస్ట్రీ కోసం ఓ సినీమాటోగ్రఫీ మినిస్ట్రీని పెట్టి – వైట్ ఎలిఫెంట్ లా మేపటమే శుద్ధ దండగనుకుంటే… నిన్న తెలంగాణ అవార్డుల ఫంక్షన్లో ఓ పెద్దాయన మాట్లాడిన మాటలకి, ఇక్కడ మంత్రులు స్పందించాలని కొందరు కోరుకోవటం మరో పనికిమాలిన అంశం.
అక్కడ అస్తులు కాపాడుకోటం కోసం – మినిస్టర్లనీ, చీఫ్ మినిస్టర్లనీ ఉబ్బేయటం కోసం ఎవరెవరో ఏవేవో మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుని పీక్కునే కంటే – ఇక్కడ తమకంటూ ఓ సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు మొదలెడితే మంచిది.
అక్కడ మాట్లాడిన వాళ్ళలో ఏ ఒక్కడూ అక్కడ ఆస్తులమ్ముకుని ఇక్కడకొచ్చి స్థిరపడడు. ఇక్కడ రాజ్యమేలుతున్న నేతలు, మహా నేతలే ఇక్కడ ఈ నేలపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం దాటాక కూడా ఇంకా బెజవాడ – కోదాడ మధ్య షేర్ ఆటోల్లా హైదరాబాదుకి వారం -వారం ప్రజాధనంతో రౌండ్ ట్రిప్పులేస్తన్నారు.
అలాంటప్నుడు సినీమా వాళ్ళ నుండి జనం ఏవేవో ఆశించటం – కేవలం పిచ్చి మాత్రమే! ఇదీ అసలు మేటర్!!
– అర్వపల్లి