– ఢిల్లీ వేదికగా చంద్రబాబు పిలుపు!
ఢిల్లీ : రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అతిపెద్ద సదస్సు అయిన క్రెడాయ్ నేషనల్ కాన్ క్లేవ్ 2025 ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమరావతి భవిష్యత్తుపై స్పష్టమైన విజన్‌ను ఆవిష్కరించారు.
సదస్సులో పాల్గొన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తూ, అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది భారతదేశపు నెక్స్ట్ జనరేషన్ గ్లోబల్ క్యాపిటల్ అని పేర్కొన్నారు.
భారతదేశం గర్వించదగ్గ సరికొత్త గ్లోబల్ స్టేట్ క్యాపిటల్‌ను నిర్మించేందుకు అమరావతి ఒక అరుదైన అవకాశం (Once-in-a-generation opportunity). ఇది దార్శనికత కలిగిన డెవలపర్లకు ఒక సువర్ణావకాశం. పూర్తి నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మైలురాయి లాంటి ప్రాజెక్టులను నిర్మించండి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మించబోయే ఈ ఐకానిక్ సిటీ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
అమరావతిలో ఉన్న అనుకూలతలు మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను చంద్రబాబు గారు వివరించారు. సింగిల్ విండో అనుమతులు, పారదర్శకమైన పాలన వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఏపీలో వేగంగా పుంజుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ కాన్ క్లేవ్ ప్రధాన అజెండా అయిన ‘నెట్ జీరో’ మరియు గ్రీన్ కన్స్ట్రక్షన్ పద్ధతులను అమరావతి నిర్మాణంలో పెద్దపీట వేస్తామని ఆయన వెల్లడించారు.
ఏపీలో ఇటీవల అమలు చేసిన ఉచిత ఇసుక విధానం, బిల్డింగ్ అప్రూవల్స్ సులభతరం చేయడం వంటి అంశాలను జాతీయ స్థాయి బిల్డర్లు అభినందించారు.
దేశంలోని టాప్ బిల్డర్లు అమరావతి వైపు చూస్తున్నారు. త్వరలోనే అమరావతిలో భారీ కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.