– ఆర్5 జోన్ ఇళ్లస్థలాలపై ‘సుప్రీంకోర్టు’ తీర్పే ప్రామాణికం
పెత్తందార్ల మానసిక యుద్ధాన్ని ఎదిరిస్తున్న ధీశాలి జగన్
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలే ఆయనకు పంచమవేదాలు
– బలమైన సీఎంగా జగన్ ఉండబట్టే పేదలకు న్యాయం జరిగింది
– క్లాస్‌వార్‌లో పేదలపక్షాన ఉన్న నేత జగన్
– అత్యున్నత న్యాయస్థానాల తీర్పుతో వెల్లడైన విషయమిది..
– జగన్ పేదలకు ఇళ్లస్థలాల్ని ఇస్తుంటే పెత్తందార్లు అడ్డుకుంటున్నారు
– ఇరువురి వాదనల్లో పెత్తందార్లకే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మొట్టికాయలు
– న్యాయస్థానాల తీర్పుల్ని అందరూ స్వాగతించాలి..
: శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్
‘సుప్రీం’తీర్పు సువర్ణధ్యాయంః
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఆ తీర్పునకు మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇళ్లు లేని నిరుపేదలకు ఒక సెంటు భూమి ఇస్తానని ప్రభుత్వం ఒక మహత్తర నిర్ణయం తీసుకుంటే.. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి వీల్లేదని కొందరు పెద్దలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే, హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పేదలకు వ్యతిరేకంగా దాఖలైన పెద్దల పిటీషన్‌ను కొట్టేసింది. పేదలకు నివాసం కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా.. హైకోర్టు మాట వినకుండా.. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఇళ్లు దక్కకూడదనే వాదనతో ఆ పెద్దలు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎట్టిపరిస్థితుల్లో పేదలకు అనుకూలమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, సుప్రీంకోర్టు వారు పెద్దమనసుతో పేదలపక్షాన పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చేలా న్యాయమైన తీర్పునిచ్చింది. పేదలకు ఇళ్లు కల్పించడమనేది రాజ్యాంగపరమైన హక్కుగా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంటే.. అడ్డుకోవడం సరైంది కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రలో సువర్ణాధ్యయంగా చూడాలి.
పెత్తందార్ల మానసిక యుద్ధాన్ని ఎదిరించిన ధీశాలి జగన్
పేదవాడికి ఒక సెంటు భూమి ప్రభుత్వం ఇస్తానంటే కొందరు భూస్వాములు, పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదలకు నీడ కల్పించరాదని ప్రభుత్వ ప్రయత్నాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పచ్చమీడియా ఛానెళ్లు, పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు అల్లుతూ.. పేదలకు ఇళ్లు ఇవ్వడమనేది పెద్దనేరమని నానాయాగీ చేస్తున్నారు. ఇది పెత్తందార్ల మానసిక పరిస్థితి. ఈ పెత్తందార్ల యుద్ధాన్ని ఎదిరిస్తూ సమర్ధంగా వారి కుట్రల్ని తిప్పికొడుతున్న బలమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పెత్తందార్ల నుంచి పేదల్ని కాపాడుకునేందుకు ఆయన చాలా చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుడవడంతో సరిపోయింది. అదే, ఏ ఇతర నాయకులైతే ఈ పెత్తందార్ల మూకుమ్మడి దాడికి ఎప్పుడో భయపడి పారిపోయేవారు.
స్ట్రాంగ్ సీఎంగా జగన్ ఉండటం పేదలకు వరం
ఆరునూరైనా ఇళ్లులేని నిరుపేదలకు సెంటుభూమిని కల్పించి వారికి ఇళ్లు కట్టించాలనే తపనతో పేదలపక్షాన జగన్ పూనుకోవడమనేది ఒక వరంగా మేమంతా భావిస్తున్నాం. లేదంటే, చంద్రబాబును కొమ్ముకాస్తున్న ఈ పెత్తందార్లను ఎదుర్కొవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలియజేస్తున్నాను. అసలు, వీరికి పేదలంటే ఎందుకంత ద్వేషమో ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదల పక్షాన నిలబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని కూడా నాడు ఇదే పెత్తందార్లు వ్యతిరేకించారు. వాళ్ల పిల్లలు మాత్రం పెద్దపెద్ద కార్పొరేట్ ప్రయివేటు స్కూళ్లల్లో లక్షలు ధారబోసి ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. మా పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు మాత్రం ఇంగ్లీషు వద్దనేది పెత్తందార్ల బుర్రలో పుట్టిన ఆలోచన. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనను హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లుగా దాఖలు చేసి టీవీలు, పత్రికల్లోనూ ఎక్కడ చూసినా ఇవే చర్చలు నడిపించారు. పేదల అవసరాలు, వారి ఔన్నత్యాన్ని పెంచే వనరుల్ని కల్పించడంలో ఈ పెత్తందార్ల దురాలోచన అనేది చాలా బాధాకరం. పేదల దురదృష్టంగా భావిస్తున్నాం.
క్లాస్‌వార్‌లో పేదలపక్షాన జగన్..
ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలపక్షాన నిలబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమాన్ని పంచమవేదంగా స్వీకరించి అనుసరిస్తున్న నాయకులు. ఇందులో భాగంగా ఆయన ‘క్లాస్‌వార్’ చేస్తున్నారు. పేదలకు సాయం చేస్తుంటే పెత్తందార్లు వద్దనడమే క్లాస్‌వార్ అని చెప్పాలి. ఈ క్లాస్‌వార్‌లో పేదల పక్షాన నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డికి మనం సపోర్టు చేయాలా..? లేదంటే, పెత్తందార్ల పక్షాన నిలబడిన చంద్రబాబులాంటి ఇతర పెద్దలకు మనం సపోర్టు చేయాలా..? పేదలకు ఇళ్లు ఇవ్వమందామా..? వద్దని అడ్డుకుందామా..? అనేది ఇప్పుడు అందరూ రాజకీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలైన పంచమవేదాలు జగన్ పక్షాన ఉన్నారనేందుకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునే తాజా ఉదాహరణగా చెప్పాలి.
ఫ్యూడల్ భావజాలంతో టీడీపీ పనిచేస్తుంది
ప్రజాప్రయోజనార్ధం పేదలకు భూములు ఇవ్వరాదని.. రాజధానిలో పేదలు ఉండకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎవరైనా వాదిస్తారా..? అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇంకా మిగిలిపోతే.. ఇక్కడ రాజధాని ప్రాంతంలో దాదాపు 50వేల ఎకరాలుంటే, వాటిల్లో కేవలం 900 ఎకరాల్ని పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయిస్తే ఇంత యాగీ చేస్తారా..? ఈ పెత్తందార్లది ఏం న్యాయమని అడుగుతున్నాను. ఇది ఫ్యూడల్ భావజాలం కాదా..? అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా ఈ పెత్తందార్లు వ్యవహరిస్తుండటం నిజంకాదా..? అని నిలదీస్తున్నాను. ఇందుకు టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాలి.
పేదలు వద్దు.. వాళ్ల ఓట్లు ముద్దు అనేది టీడీపీ వాదన
రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని వాదించే పెత్తందార్ల దుర్మార్గమైన ఆలోచనను ప్రతీ ఒక్కరూ ఖండించాలి. ఈ పెత్తందార్లకు వెనుకేసుకొస్తున్న టీడీపీ, చంద్రబాబుకు మాత్రం పేదలు వద్దు.. వాళ్ల ఓట్లే ముద్దు అనేరీతిగా వ్యవహరిస్తున్నారు. మురికివాడలు, పేదలకాలనీలు అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల చులకన భావంతో చిన్నచూపుతో పనిచేస్తున్న పెత్తందార్ల పురాతన ఆలోచనల్ని మార్చుకోవాలని.. పేదలకు న్యాయం జరుగుతున్నప్పుడు రాజకీయాంశాల్ని పక్కనబెట్టాలని నేను మనవి చేస్తున్నాను.
ప్రజాసంఘాలు, వామపక్షాల మౌనం మంచిది కాదుః
గతంలో పనిచేసిన చాలా ప్రభుత్వాలు పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే, వీధిపోరాటాలు చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులెందరో ఉన్నారు. ఆనాడు వీధిపోరాటాలు చేసినప్పటికీ, అప్పటి ప్రభుత్వాల్లో ఏమాత్రం చలనం కనిపించలేదు. పేదలపట్ల జాలి, కరుణ, దయలేకుండా.. వారు చేసే పోరాటాల్ని అణచివేసిన పరిస్థితిని అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. మరి, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అర్హులైన పేదవాళ్లందరికీ ఇళ్ల స్థలాలిస్తుంటే దాన్ని ఈ మేధావులు, ప్రజాసంఘాలు, వామపక్షాలు స్వాగతించలేరా..? అని అడుగుతున్నాను.