– గుదిబండ కట్టుకుని నూతిలో దూకటం కాదు
– అన్ని దేశాలలో ఏకకాలంలో మాట్లాడే ఏకైక రాజనీతిజ్ఞుడు మోదీ మాత్రమే
– దేశంలో చమురు కొరత లేదు.. అంతా కృత్రిమమే
– బ్లాక్‌మార్కెటీర్లపై చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
– ఇరాన్‌తో ఇండియాకు సత్సంబంధాలు
ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇంధనం కొరత ఏర్పడి ధరలు 100% పైన పెరిగిపోయిన విషయం మనం చూస్తున్నాం. అనేక దేశాలలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం మూసివేస్తున్నారు. వారానికి 15 లీటర్లు చొప్పున కూపన్లు ఇస్తున్నారు. అనేక దేశాలలో పెట్రోలు బంకులు వద్ద జరుగుతున్న తుపాకీ కాల్పులను కూడా మనం చూస్తున్నాం.
ఇటువంటి దుర్భర పరిస్థితుల నడుమ కేవలం భారతదేశం మాత్రమే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా, తగినన్ని నిల్వలతో ప్రజలకి అందుబాటులో ఉంచుతున్న విషయం ప్రజలు గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటూ దేశ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని కష్టపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్న నిల్వలు గురించి తెలియజేస్తూ ప్రజల్ని కంగారు పడద్దని అనవసరంగా కొనుగోలు చేయొద్దని అనధికారిక నిల్వలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం ప్రస్తుత ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వినియోగాన్ని కొంతవరకు తగ్గించుకుంటూ వృధా చేయకుండా డీజిల్ పెట్రోల్ నిల్వలు ఇంటిలో క్యాన్లలో ఉంచుకోకుండా దేశానికి సహకరించవలసిన అవసరం ఉంది.
గృహ వినియోగానికి LPG కొరత ఎక్కడా లేదు, వ్యాపార వినియోగానికి ఎల్పిజి అందుబాటు మరింతగా ప్రభుత్వం పెంచుతోంది. హార్మోస్ జల సంధి నుండి భారతదేశ ఇంధన నౌకలు స్వేచ్ఛగా తిరగటానికి ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు లేవని, భారతదేశం మా మిత్ర దేశమని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇరాన్ రాయబారి ప్రకటించిన తరుణంలో రానున్న రోజుల్లో చమురు, ఎల్పిజి ఓడలు ఇంకా ఎక్కువగా రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా 40 పైగా దేశాల నుండి ముడి చమురుని ఎల్‌పిజిని దిగుమతి అత్యంత వేగంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పెట్రోల్ డీజిల్ ని అనధికారికంగా నిల్వలు ఎవరు చేయకుండా చూడటంతో పాటు LPG సిలిండర్లు బ్లాక్ లో అధిక ధరకి అమ్మనివ్వకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రపంచం ఉన్న ఇటువంటి సంకట స్థితిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని వారి విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తున్న వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే యుద్ధంలో ఉన్న ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ దేశాలతో ఏకకాలంలో మాట్లాడగలిగిన ఏకైక దేశం, ఆయా దేశాధినేతలు నమ్మి ఏకైక నేత ప్రధాని మోడీ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. భారతదేశం మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి రాయబారి పదేపదే చెబుతున్న మాటలు మీ చివిన పడటం లేదా..?
ప్రధాని మోడీ ప్రధమ ప్రాధాన్యత 140 కోట్ల భారతీయుల యొక్క రక్షణ, అభివృద్ధి, వారికి కావలసిన సౌకర్యాలు అందించడం ఆ తర్వాత గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న కోటి మంది భారతీయుల్ని సురక్షితంగా భారతదేశ్యానికి తీసుకురావడం.
విదేశాంగ విధానం దౌత్యనీతి అంటే గుదిబండ కట్టుకొని బావిలో దూకటం కాదు. తెలివిగా ఉంటూ తమ దేశ అవసరాలని తీర్చుతూ ఎటువంటి ఇబ్బందులు దేశ ప్రజల మీద పడకుండా చూసుకుంటూ, తా నవ్వక ఎదుటివారిని నొప్పించక సాగటమని తెలుసుకోండి.
– పెద్దిరెడ్డి రవికిరణ్
( బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి)