– దానికి టిడిపినే వ్యాక్సిన్
-వైసీపీ భూ స్థాపితం ఖాయం
– టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
• చంద్రబాబు నాయుడు పర్యటనలో వేలాదిగా పాల్గొన్న టిడిపి కార్యకర్తలు, ప్రజలు
• గురజాల పట్టణంలో జరిగిన సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం
మీటింగ్ ఇంత ఆలస్యం అయినా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. పల్నాడు మహానాడు పెట్టుకున్నాము….కానీ వర్షాల కారణంగా రైతులను పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చాను. పల్నాడు పర్యటనలో అడుగడుగునా ఘనస్వాగతం పలికారు… అందుకే పర్యటన ఇంత ఆలస్యం అయ్యింది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా ఎక్కడైనా? వర్షాలు వస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు. మిరప, పత్తి పంటలకు వర్షాల కారణంగా గరిష్టంగా లక్ష రూపాయల నష్టం వచ్చింది.సిఎం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే బాధలు తెలియవు….ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడు.
హుద్ హుద్ వస్తే తుఫాను కంటే ముందు నేను ప్రభావిత ప్రాంతానికి వెళ్లాను.సిఎం ఒక్క విపత్తుకు అయినా స్పందించాడా…పంట నష్టం పై చూడడానికి వచ్చాడా?గత ఏడాది మిర్చి పంటకు తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు ప్రాంతంలో 157 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడవ స్థానంలో ఉంది. జగన్ మోసాలు చెయ్యడంలో దిట్ట…కడుపు అబద్దాల పుట్ట. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. రైతులకు వచ్చే సబ్సిడీలు అన్నీ ఆపేశారు. స్కూళ్లలో నాడు నేడు అన్నాడు….కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి.
వివేకా హత్యలో ఆయన కుమార్తె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్ర అని నాడు రాశారు. అప్పుడు సీబీఐ విచారణ కావాలి అన్నాడు…ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు. జగన్ వైఖరిపై బాధతో సునీత పట్టుదలతో పోరాడుతుంది.ఒక సిఐకి ప్రమోషన్ ఇచ్చి…వివేకా కేసులో సాక్ష్యం చెప్పకుండా చేశారు. మీరు చేసిన తప్పులు మీకు చుట్టుకుంటాయి…మీరు జైలుకు వెళ్లడం ఖాయం ఎవరైతే పోలీసులు తప్పుడు కేసులుపెడుతున్నారో….వారంతా రేపు ఒకటి ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాన్ పై తీవ్రంగా దాడి చేశారు..పవన్ చెప్పు చూపించాడు అంటే ఎంత వేదన చెందాడో ఆలోచించాలి.నా కుటుంబం పై ఇలాగే దాడిచేస్తే….గెలిచిన తరువాతనే సభకు వస్తాను అని చెప్పాను.
అధికారం ఉందని విర్రవీగుతున్నారు. జగన్ పెంపుడు కుక్కలు మాపై దాడులు చేస్తే సహించేది లేదు. నాడు హైదరాబాద్ ను అభివృద్ది చేస్తే , తరువాత వచ్చిన వైఎస్ ఆర్ అడ్డుపడలేదు…నాశనం చెయ్యలేదు. రాజశేఖర్ రెడ్డి నాడు అడ్డుపడి ఉంటే హైదరాబాద్ అభివృద్ది ఏమయ్యేది? రాష్ట్రానికి ఎవరూ చేయని అన్యాయం జగన్ చేశాడు. 2024 కావచ్చు…అంతకుముందు ఎన్నికలు రావచ్చు…ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైసిపి ని చిత్తుగా ఓడించాలి ఈ రాష్ట్రానికి వైసిపి అనే వైరస్ పట్టింది. దానికి టిడిపినే వ్యాక్సిన్.