– గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న ప్రజలు.
– ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంచాయితీలు నిర్వీర్యం
– పతనం అంచులో ప్రభుత్వం
– మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సకాలములో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోవడం ప్రభుత్వ అసమర్థత అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయినాయని ప్రభుత్వ పనితీరు బాగుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని కానీ ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
పార్టీపరంగా జరిగిన ఎన్నికలు కాకున్నా గులాబీ జెండా,కె.సి.ఆర్ బొమ్మ,స్థానిక నాయకులు కనిపిస్తే చాలు ప్రజలు గుండెలకు హత్తుకున్నారని దీన్ని బట్టి ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న అసంతృప్తి ప్రస్పుటం అయిందని స్పష్టం చేశారు.బి.ఆర్.ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తుంటే ఈ ప్రభుత్వం పతనం అంచులో ఉందని అర్థమౌతుందని అందుకే బి.ఆర్.ఎస్ విజయ దుందుభి మోగించింది అని అన్నారు.
అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు, దౌర్జన్యాలకు,ప్రలోభాలకు, మాయమాటలకు పాల్పడిన ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బి.ఆర్.ఎస్ ఎక్కడుంది పార్టీని బొంద పెట్టినం అన్నవాళ్ళకు ఈ విజయం చెంపపెట్టులాంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విజయం రేవంత్ అహంకారానికి గుణపాఠం అని ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు,ధన్యవాదాలు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.