* తప్పులు చేయొద్దని చెప్పినా వినలేదు
* భువనమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు
* మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడ్ని చంపారు
* ఎస్సీ, ఎస్టీ, బీసీలను అక్రమ కేసులతో వేధించారు
* గత ప్రభుత్వ పాలనలో అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తులు
* త్వరలో మరికొందరు గజదొంగల పేర్లు బయటకు
* తప్పులు చేయకుంటే జగన్ కు, వైసీపీ బ్యాచ్ కు భయమెందుకు..?
* బీసీ కార్పొరేషన్లతో మంత్రి సవిత భేటీ
* బీసీ రక్షణ చట్టం, ఆదరణ 3.0, ఇతర పథకాలపై అభిప్రాయాల సేకరణ
– మంత్రి సవిత
విజయవాడ : ‘అయిదేళ్ల అసమర్థ పాలనలో తప్పులు మీద తప్పులు చేశారని, వాటిని సరిదిద్దుకోవాలని ఆనాడే బాధ్యత గల ప్రతిపక్షంగా హెచ్చరించాం… కాని, మా మాటలను పట్టించుకోలేదు.. ఆనాడు మీరు చేసిన తప్పులకే నేడు కేసుల రూపంలో ఫలితం అనుభవిస్తున్నారని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదు’ అని జగన్ నుద్దేశించి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందిని, మరికొందరు గజదొంగలు బయటకు రాబోతున్నారని వెల్లడించారు. తప్పు చేయకుంటే జగన్ కు గాని, ఆయన బ్యాచ్ గాని భయమెందుకు అని ప్రశ్నించారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని పనిచేయడం కక్ష సాధింపా..? అని ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన వైసీపీ నాయకుడు జోగి రమేశ్..బీసీ కార్డు ఉపయోగించడం చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు.
కులం పేరుతో చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కుదరదన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి, భూదేవిలాంటి భువనమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి ప్రాణం కోల్పోయేలా చేశారన్నారు. ఎందరో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అక్రమంగా వేధించి, జైల్లో పెట్టారన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో తప్పుల మీద తప్పులు చేశారన్నారు.
తప్పిద్దాలను సరిదిద్దుకోవాలని జగన్ ను ఆనాటి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా హెచ్చరించామన్నారు. ఆ తప్పులు ఫలితమే నేటి కేసులని, ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని స్పష్టంచేశారు. జగన్ హయాంలో జరిగిన తప్పిదాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరికొందరు గజదొంగల వివరాలు బయటకు రానున్నాయని వెల్లడించారు. తప్పులు చేయకుంటే జగన్ కు, ఆయన బ్యాచ్ కు భయమెందుకని మంత్రి ప్రశ్నించారు.
‘ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సహా పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.