Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు బస్సుమీద ఉన్న ఆ నలుగురూ కమ్మోళ్లే

– అది కమ్మవాళ్ళ కుల మీటింగ్ అవుతుంది తప్పితే.. ప్రజల మీటింగ్ ఎలా అవుతుంది?
– నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేని బాబు.. ఉత్సవాలు జరపడమా..!?
– చంద్రబాబు బస చేయడానికి నిమ్మకూరులో ఏ ఒక్కరూ ఇల్లు ఇవ్వలేదు
– ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో చంద్రబాబుకు ఉన్న పరపతి అది.
– మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహమైనా పెట్టావా..?:
– కనీసం నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు పెట్టలేకపోయాడు.
– నిమ్మకూరులో నేను, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం
– అలాంటి వ్యక్తి నిమ్మకూరు వచ్చి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే, శత జయంతి ఉత్సవాలు జరుపుతానంటుంటే.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.
– నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశాడు
– ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరు మీద ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తులు కేవలం హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మాత్రమే
– 42 ఏళ్ల తర్వాత, అత్తారింటికి నిమ్మకూరు వచ్చి చంద్రబాబు బస్సులో నిద్రించాల్సి వచ్చింది
– చంద్రబాబు నిద్రించడానికి నిమ్మకూరులో ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు

రెండెకరాల చంద్రబాబుకు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్‌..?:
– తన భార్య ఆస్తులను చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు
– అఫిడవిట్ ప్రకారం.. భార్య ఆస్తులతో కలిపి చంద్రబాబు ఆస్తి విలువ రూ.668 కోట్లు
– రెండెకరాల నుంచి చంద్రబాబు ఆస్తి రూ.668 కోట్లకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలి.
– క్రిస్టియన్లపై విమర్శలు చేసిన చంద్రబాబు- సిగ్గులేకుండా పాస్టర్లతో ఎలా మీటింగ్‌ పెట్టావ్‌
– చంద్రబాబు తన అవసరానికి ఎవడి బూట్లైనా నాకుతాడు

చంద్రబాబు పక్కన కమ్మవారు తప్ప వేరొకరు ఉండకూడదా..?:
– గుడివాడలో రాత్రి మేకప్‌ వేసుకోవడానికి చంద్రబాబు.. మూడుచోట్ల బస్సు ఆపాడు
– అనేక మతాలు,కులాల సమ్మేళనం గుడివాడ
– చంద్రబాబు బస్సుమీద ఉన్న ఆ నలుగురూ కమ్మోళ్లే . అది కమ్మవాళ్ళ కుల మీటింగ్ అవుతుంది తప్పితే.. ప్రజల మీటింగ్ ఎలా అవుతుంది.
– జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఏమైపోయాడు..?..ఆంబోతు అచ్చెన్నాయుడు ఏమయ్యాడు..?
– చంద్రబాబు పక్కన కమ్మవారు తప్ప మరొకరు ఉండకూడదా ?
– అచ్చెన్నకు కొంచెం గట్టి చట్నీ వేసి తీసుకొస్తే వచ్చేవాడు కదా..?
– మొన్న గెలిచిన ఎమ్మెల్సీ అనురాధ కూడా ఏమైపోయింది..?
– గంటన్నరపాటు ఖాళీ కుర్చీలకు సొల్లు కబుర్లు చెప్పాడు చంద్రబాబు.

చంద్రబాబు ఎవరికి ప్రచారం చేసినా ఓటమి తప్పదు:
– చంద్రబాబు గుడివాడలో ఎవరికి ప్రచారం చేసినా ఓడిపోవడమే జరుగుతుంది.
– దేవుడి దయవల్ల చంద్రబాబు నాకు ప్రచారం చేయలేదు కాబట్టే నేను గెలిచాను
– రానున్న ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ ఓడిపోవడం ఖాయం
– చంద్రబాబు జిత్తుల మారి నక్క..గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు
– దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుడివాడలో పేదల ఇళ్ల కోసం భూములు కొన్నారు
– టిడ్కో ఇళ్లతో కలిపి 23 వేల మందికి సొంతింటికల నెరవేర్చబోతున్నాం

చంద్రబాబుకు ఇదే నా బహిరంగ సవాల్‌:
– చంద్రబాబు గుడివాడలో పేదల కోసం ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇదే నా బహిరంగ సవాల్.
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగాఉన్న చంద్రబాబు.. గుడివాడకు ఫ్లై ఓవర్‌ ఎందుకు వేయించలేకపోయాడు..?
– గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నావా..? గుడివాడను చంద్రబాబు గాలికొదిలేశాడు.
– జగన్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక రూ.16 కోట్లతో సైడ్‌ కాల్వలతో కలిపి రోడ్ల నిర్మాణం జరుగుతోంది
– రూ.600 కోట్లు.. ఇళ్ల స్థలాల కోసం సీఎం ఖర్చు చేస్తున్నారు
– గుడివాడకు మంచినీటి సదుపాయం కల్పించింది వైఎస్సార్‌ గారు మాత్రమే
– మూడు మండలాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి రూ.130 కోట్లతో టెండర్లు సిద్ధం చేశాం
– రూ.23 కోట్లతో బస్టాండ్‌ నిర్మిస్తున్నాం..రూ.15 కోట్లతో ఆసుపత్రి ప్రారంభించనున్నాం
– మే నెలలో సీఎం గారు బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తారు
– బందరు పోర్టును చంద్రబాబు రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు అప్పగించాడు

తండ్రీ కొడుకులు ఇద్దరికీ ఈ సారి ఓటమి తప్పదు:
– కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేరు
– ఎన్ని మహాకూటములు పెట్టుకున్నా.. 2024లోనూ హిస్టరీ రిపీట్‌ అవుతుంది
– మీరంతా వైఎస్‌ జగన్‌ ప్రభంజనం ముందు కొట్టుకుపోతారు
– బస్సులోకెళ్లి గంటగంటకు గంజాయి కొట్టొచ్చేది చంద్రబాబే
– నాకు చంద్రబాబు రాజకీయ జీవితం ఇస్తే..చంద్రబాబుకి రాజకీయ జీవితం ఇచ్చిందెవరు..?
– రాజకీయ జీవితం ఇచ్చిన ఇందిరాగాంధీని, ఎన్టీఆర్ ను ఏం చేశాడో గుర్తులేదా..?

వెయ్యి కోట్ల స్థలంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
– రాజ్యాంగం ప్రధాత డా.బిఆర్‌.అంబేద్కర్‌…ప్రతీ ఒక్కరూ ఆయన బాటలో నడవాలి
– డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– వెయ్యికోట్ల విలువైన స్థలంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం
– మరో మూడు నెలల్లో విగ్రహం పూర్తిచేసి, సిఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తాం
– ఈ దేశంలో అత్యంత ఘనంగా అందరూ జరుపుకునే పండుగ అంబేద్కర్‌ జయంతి
– అంబేద్కర్‌ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు
– డాక్టర్ అంబేద్కర్‌ వంటి మహనీయుల జయంతి రోజున 420 చంద్రబాబు గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టం.

LEAVE A RESPONSE