– తండ్రికి మేనత్తలు ,తనకు తోబుట్టువు,తనయుడికి తనయురాలు
– రాఖీ పౌర్ణమి రోజున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబంలో అరుదైన సందర్భం
తండ్రి రామచంద్రారెడ్డికి మేనత్తలు కల్మేకొలను అండమ్మ(96),కడారు వసంత(81) తనకు తోబుట్టువు రేణుక తనయుడు వేమన రెడ్డికి తనాయురాలు లహరి లు రాఖీ కట్టిన అరుదైన సందర్భం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకుంది.
రక్షాబంధన్ పర్వదినాన్ని ఏక కాలంలో మూడు తరాలు సంబురాలు జరుపుకున్నారు
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం పల్లేపహాడ్ లో జరిగిన ఈ వేడుకలలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి(93)కి ఆయన సోదరీమణులు 96 ఏళ్ల కల్మేకొలను అండమ్మ, కడారు వసంత(81) లు రాఖీలు కట్టగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఆయన తోబుట్టువు కట్టా రేణుక,జగదీష్ రెడ్డి తనయుడు వేమన రెడ్డికి తనయురాలు లహరి లు రాఖి కట్టిన సంబురాలు ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి