– అభ్యర్థి ఇంటిలోనే కుటుంబ సభ్యునికి మూడు దొంగ ఓట్లు ఉన్నప్పుడు కూడా రాహుల్ స్పందించరా?
– మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి పంచారు
– ఓట్లన్నిటిని ఎన్నికల షెడ్యూల్ కింద రాయించారు
డూప్లికేట్, నకిలీ ఓట్లను వెంటనే డిలీట్ చేయాలి
– రాహుల్ లేవనెత్తిన ఓట్ చోరీ అంశంతో పోల్చితే ఇది తక్కువ ఏమీ కాదు
– కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు పై ప్రెజెంటేషన్ ఇచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా గెలిచేది మాత్రం భారత రాష్ట్ర సమితినే. ఈ ఉప ఎన్నికల సందర్భంగా 23 వేల ఓట్లు పెరిగాయని చెప్తున్నారు. వీటితోపాటు 12000 ఓట్లు డిలీట్ అయ్యాయని చెబుతున్నారు. అసాధారణంగా ఏ విధంగా ఓట్లు పెరిగాయి అన్నది అనేక అనుమానాలకు దారితీస్తుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి, ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకొని అక్రమంగా ఓటు ఐడీలను పంచారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి పంచారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఏం సంబంధం? ఆయన ఫోటోలు పెట్టుకుని మరీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఫేక్ ఐడీ కార్డుల పంపిణీ జరిగింది అని ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాతనే మా పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మొత్తం వ్యవహారంలో పరిశీలన చేయడం జరిగింది. 43 ఓట్లు ఉన్న సాంస్కృతి అపార్ట్మెంట్స్ వెళ్లి చూశాము. అక్కడ ఉన్న ఓనర్ “మాకు సంబంధం లేదు” అని చెప్పారు. “ఇక్కడ ఉన్న వాళ్లకు, ఉన్న ఇంటి యజమానులకు, ఈ లిస్టులో ఉన్న వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు.
బూత్ నంబర్ 125 లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి. 80 గజాలు మాత్రం ఉన్న ఇంట్లో ఎంతో మంది ఎందుకు వచ్చారు మాకు తెలవదని యజమాని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అన్న అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి.
ఇట్లా దొంగ ఓట్లు, రెండు మూడు ఓటర్ ఐడీ కార్డులు, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘానికి ఇప్పటికే అందించాం. జూబ్లీహిల్స్ లో ఓటుగా నమోదు అయిన సిరిసిల్ల నివాసిని శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడితే, తనకు సంబంధం లేకుండానే తన ఓటును జూబ్లీహిల్స్ లో నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. తన పేరుతో దొంగ ఓటు రాయించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఎపిక్ కార్డులు ఉన్నాయి. ఓట్లన్నిటిని కూడా ఎన్నికల షెడ్యూల్ కింద రాయించారు. ఇంత దిక్కుమాలిన, సిగ్గులేని చర్యలకు కాంగ్రెస్ పాల్పడింది. 42 ఓట్లు ఉన్నాయని ఓటర్ లిస్టులో పేర్కొన్న ఇంటి నెంబర్ తోని వెతికితే అసలు ఆ ఇల్లే లేదు. ఇంతటి దారుణాలు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఒకటే రోజు ఓటర్ల జాబితాలో నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం.
సొంతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడి వెంకట్ ప్రవీణ్ యాదవ్ కు మూడు ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్నాక స్వేచ్ఛగా ఓట్లు ఎట్లా జరుగుతాయని అని మేము అనుకోవాలి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకా ఎక్కడ ఉంటుంది? ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల కమిషన్ కి కలిసి పార్టీ తరఫున లేఖ కూడా ఇచ్చాము.
మేము అడిగింది అయితే 24 గంటలు దాటినా ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోసారి ఎన్నికల సంఘానికి మూడు ప్రధానమైన డిమాండ్స్ చేస్తున్నాం. మొత్తం కొత్తగా వచ్చిన 23 వేల ఓట్ల పైన సంపూర్ణ దర్యాప్తు జరగాలి.డూప్లికేట్, నకిలీ ఓట్లను వెంటనే డిలీట్ చేయాలి. ఈ ఓట్ల నమోదుకు పాల్పడిన, ఓట్ల అక్రమాలకు పాల్పడిన అధికారులు అందరి పైన చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలి. ఎన్నికల సంఘానికి సంబంధించిన విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. వెంటనే ఈ అంశం పైన కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాలి. మేము లేవనెత్తిన ప్రతి ఒక్క అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టాలి. ఇంత స్పష్టంగా ఓట్ చోరీకి సంబంధించిన రుజువులన్నింటిని ప్రజల ముందు ఉంచాము.
కేవలం రెండు రోజుల్లోనే మా పార్టీ కార్యకర్తలు ఇన్ని అక్రమాలను గుర్తించ గలిగినప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కలిగిన ఎన్నికల కమిషన్ ఎందుకు అక్రమాలను గుర్తించి తొలగించలేకపోతున్నది? 24 గంటలు దాటినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి రేపు హైకోర్టుకి వెళ్తాం.
తెలంగాణ ఓట్ చోరీ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలి
బీహార్ లో జరిగింది ఓటు చోరీ. తెలంగాణలో చోరీ ఓట్లతో కాంగ్రెస్ ఎన్నికలలో గెలవాలని చూస్తుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని బీహార్ లో ఇతర రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికలకు గెలవాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణలోకి తీసుకొని వీటి పైన ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలి. బీహార్లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ అంశంతో పోల్చితే ఇది తక్కువ ఏమీ కాదు.
తమ సొంత పార్టీ అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాధికారులు కాంగ్రెస్తో కుమ్మక్కైన అంశం పైన స్పందించాలి. సొంతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటిలోనే కుటుంబ సభ్యునికి మూడు దొంగ ఓట్లు ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ స్పందించాలి.
కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఎన్ని రకాల ఎన్నికల అక్రమాలకు పాల్పడితే రాహుల్ గాంధీ చెప్పకుండా స్పందించాలి. ఈ అంశం పైన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పందించాలి.