– యాదవులకు రెండు లక్షల నగదు బదిలీ చేస్తమన్నారు.. ఏమైంది?
– ఎస్సీ కార్పొరేషన్ కు 5403 కోట్లు కేటాయించి 73 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
– దళితులపై ఇదేనా ప్రేమా?
– ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నారా? లేదా?
– ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు చేసింది 52 కోట్లు మాత్రమే
– అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తారో లేదో అన్న అనుమానం
– గోపాల మిత్రలకు వేతనాలు ఎప్పుడు ఇస్తారు?
– గీత కార్మికులకు రెండేళ్లుగా ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వలేదు?
– పద్దులపై చర్చ సందర్భంగా బీ ఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత టి .హరీష్ రావు
హైదరాబాద్: బీఆర్ఎస్ పోరాటం వల్లే అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చింది. మైనార్టీ సంక్షేమ శాఖకు డబ్బులు ఇవ్వకుండా అజారుద్దీన్ పేరును చెడగొడుతున్నారు. ఉపముఖ్యమంత్రితో అజారుద్దీన్ కొట్లాడి నిధులు తేవాలి. ఉర్దూ అకాడమీలో తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. గడువు సమీపిస్తోంది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తారో లేదో అన్న అనుమానం కలుగుతోంది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను.
వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం ఎందుకు తగ్గింది? అంతర్జాతీయ పరిణామాలు పరిగణలోకి తీసుకున్నారా? ఈ ఏడాది ఆదాయం ఎలా పెరుగుతుందో చెప్పాలి? ఎక్సైజ్ ఆదాయం 12 వేల కోట్లు ఎక్కువగా అంచనా వేశారు. ఎలా వస్తుంది? అదనంగా 25 వేల కోట్ల విలువైన మద్యం ఎలా వస్తుంది? కొత్త పాలసీ తెస్తారా? దుకాణాలు పెంచుతారా? లిక్కర్ సరఫరాదారులకు బకాయిలు చెల్లింపుల విషయంలో సమాధానం చెప్పాలి.
సీఎం చెప్పిన తర్వాత కూడా గీత కార్మికులకు రెండేళ్లుగా ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వలేదు? ఎప్పటిలోగా చెల్లిస్తారు? మైక్రో బ్రీవరీస్ ఎంపిక ప్రాతిపదిక గురించి చెప్పాలి. కల్లు డిపోలపై దాడులు చేసి మూసి వేస్తున్నారు… గీత కార్మికులపై వేధింపులు ఆపాలి. ఎస్సీ కార్పొరేషన్ కు 5403 కోట్లు కేటాయించి 73 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితులపై ఇదేనా ప్రేమా? ఎస్టీ ఎస్డీఎఫ్ తక్కువ ఖర్చు పెట్టిన మాట వాస్తవమేనా?
మాల, మాదిగ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కేటాయించి, ఖర్చు చేయని మాట వాస్తవమా?కాదా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? దళిత బంధు గత రెండేళ్లుగా భట్టి నియోజకవర్గంలో మాత్రమే కొన్ని నిధులు ఇచ్చారు… మిగతా నియోజకవర్గాల్లో ఇస్తారా? లేదా? ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నారా? లేదా? 50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములు తీసుకుంటున్నారు.పట్టా భూములతో సమానమైన పరిహారం ఇచ్చే ఆలోచన ఉందా?
ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు చేసింది 52 కోట్లు మాత్రమే. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం ఆరు లక్షలు ఇస్తామని అన్నారు… క్యారీ ఫార్వర్డ్ నిధులు ఉన్నాయి, పెంచండి. రుణమాఫీ విషయంలో గవర్నర్, సభను తప్పుదోవ పట్టించారు. భవిష్యత్ లో అలా కాకుండా చూసుకోవాలి. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.పంటల బీమా పథకం అమలు చేయండి. గత యాసంగిలో బోనస్ ఇవ్వలేదు. ఈ సారి ఇస్తారా? ఇవ్వరా?
పంట ఏదైనా దిగుబడి మొత్తం కొనేలా చూడాలి. పీఏసీఎస్ ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. యాదవులకు రెండు లక్షల నగదు బదిలీ చేస్తమన్నారు. ఏమైంది? నాలుగు నెలలకోసారి వేయాల్సిన నట్టల మందు ఎందుకు ఇవ్వడం లేదు? గోపాల మిత్రలకు వేతనాలు ఎప్పుడు ఇస్తారు?
గొర్రెలు, చేప పిల్లల పంపిణీ కొనసాగించండి.