– ఏర్పాట్లు పరిశీలించిన డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా
విజయవాడ: ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న స్వాతంత్ర వేడుకల భద్రత ఏర్పాట్లను విషయమై బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు, సలహాలను అందించారు. అనంతరం పోలీస్ పరేడ్ ను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలను జారీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర డి.జి.పి. మాట్లాడుతూ… స్వాతంత్ర వేడుకలలో పాల్గొనడానికి వి.వి.ఐ.పి.లు/వి.ఐ.పి.లు, ప్రజలు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి వస్తారు కనుక స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ.డి.జి. మధుసూదన రెడ్డి, ఐ.జి. బి.రాజ కుమారి, డి.సి.పి.లు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వర రెడ్డి, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.