Suryaa.co.in

Telangana

మళ్లీ మీ ముందుకు వస్తా!

మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్నిఅన్ని రకాలుగా కులమతాలకు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటనలో భాగంగా ఆయన నేలకొండపల్లి మండల పరిధిలో ఉన్న కొత్తకోత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో, మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొంది మీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశానన్నారు.. రాష్టం లో అన్ని జిల్లాల కన్నా అధికంగా మన ఖమ్మం జిల్లాలోనే పది నియోజకవర్గాల అభివృద్ధికై ఎంతో శ్రమించాను అన్నారు..! ఈ నలభై సంవత్సరాలలో అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేశాను కానీ కొన్ని సార్లు రాజకీయ జీవితంలో గెలుపు,, ఓటములన్నింటిని ఎత్తు పల్లాలుగా చూసాను అని తుమ్మల పేర్కొన్నారు.

అభివృద్ధి విషయం లో ఓ సవాలుగా చేసుకొని మాత్రమే రాజకీయం చేశానన్నారు… పాలేరు నియోజకవర్గంలో అన్ని విధాలా ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలనుముందుగానే గుర్తించి సీసీ రోడ్స్, డ్రైన్స్,తో పాటు మౌళిక సదుపాయాలు ప్రజలకు అందేలా తీర్చేశానన్నారు… పాలేరు నియోజకవర్గంలో మూడు సంవత్సరాల్లో సాగు నీటిని అందించి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేశానన్నారు. తద్వారా ఈ ప్రాంత భూముల ధరలకు రెక్కలు వచ్చాయిన్నారు.

గ్రామాల్లో సమస్యల కోసం తన దగ్గరకు రానవసరం లేదని, ప్రజాసమస్యలు తన చెవికి వినబడితే చాలని, అవి పూర్తి చేసే శక్తిని భగవంతుడు తనకు ఇచ్చాడన్నారు. ప్రజల కోరికతో పార్టీ నిర్ణయంతో వచ్చే ఎన్నికలో మళ్లీ మీ ముందుకొస్తానని ఘంటపదంగా…ఉద్గటించారు మీ ఆశీస్సుల తో మళ్లీ మీ ముందుకువస్తానాని ప్రజా సేవే తన అభిష్టం అని బ్రతికినంతకాలం మంచి రాజకీయ నేతగా ఉండటమే తనకు ఇష్టం అంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన మనోగతాన్ని వెల్లడించారు..

ఉత్సాహంలో తుమ్మల వర్గం
తుమ్మల నేల కొండపల్లి మండల పర్యటనలో తన క్యాడర్ కు ఉత్సాహ పరిచే రీతిలో చేసిన ఆసక్తి కర వ్యాఖ్యల పై నియోజకవర్గంలో తో పాటు ఉమ్మడి జిల్లాలో హాట్ హాట్ గా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు తో చర్చకు దారితీశాయి. పలు గ్రామాల్లో పర్యటించిన ఆయనకు అభిమానులు ప్రజలు పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి,బండి జగదీష్,కర్నాటి భానుప్రసాద్,భద్రయ్య,మాదాసు ఉపేందర్,వెన్నపూసల సీతారాములు ,రమేష్ తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE