– అభివృద్ధి నిరోధకత అనేది ఒక మానసిక జబ్బు.
– అది కమ్యూనిస్టుల కి జన్మతః వచ్చింది
( అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం)
ఒకేసారి 200 పెద్ద నగరాలకు ఆగకుండా విద్యుత్ సరఫరా జరిగితే ఎలా ఉంటుంది?
100 పారిశ్రామిక నగరాలకు యూనిట్ ఆరు రూపాయల్లో సరఫరా జరిగితే ఎలా ఉంటుంది?
అదీ కార్బన్ డయాక్సైడ్ వంటి పర్యావరణ నష్టం చేసే ఉద్గారాలు తగ్గితే ఎలా ఉంటుంది?
ఇప్పుడు అత్యాధునిక డేటా సెంటర్లు… ఏఐ సెంటర్లకు ఆగకుండా విద్యుత్ అందిస్తే ఎలా ఉంటుంది?
అడవుల్లో కొండల్లో ఉన్న బొగ్గు ను తవ్వకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటే ఎలా ఉంటుంది?
ఆర్థికాభివృద్ధి నీ…దేశాన్ని కాపాడుకోవాలంటే ఎంతటి రక్షణ వ్యవస్థ కావాలి?
ఆ రక్షణకి అవసరం అయిన అణు ( విద్యుత్) సామర్థ్యం కలిగితే ఎంత బాగుంటుంది?
అప్పుడే సదా శాంతి…ప్రశాంతి!
శాంతి ఉంటేనే ఆర్థిక శక్తి…
దీనికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అసాధారణ లక్ష్యం…ఆకాశాన్ని అంటే ఆత్మవిశ్వాసం.
దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడికి సిద్ధం.
లోక్ సభ ఆమోదించిన మహత్తరమైన బిల్లు
” శాంతి”
“SHANTI”
జీ రామ్ జీ ఆశీస్సులతో ఈ బిల్లు కూడా పాస్ అయిపోయింది.
SHANTI Bill, 2025 ..Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India ఆమోదించబడింది.
ఎంతటి భారీ లక్ష్యం అంటే…ఇప్పుడున్న 8.8 గిగా వాట్ అణువిద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని 100 గిగా వాట్ లకు పెంచెయ్యడం.
ఊహకే అందని లక్ష్యం…2047 కి చేరుకోవాలి.
ఈ బిల్లుతో… క్లీన్ & స్థిరమైన న్యూక్లియర్ పవర్ పెరుగుతుంది… ప్రైవేట్ రంగం పెట్టుబడులు…సాంకేతికత వస్తాయి.
కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి..విదేశీ–దేశీయ పెట్టుబడులు పెరుగుతాయి..
లైబిలిటీ క్లాజ్ ద్వారా…పెట్టుబడులకు అడ్డంకులు తొలగుతాయి…AERB కి చట్టబద్ధ బలం.
లక్షల్లో నైపుణ్య ఉద్యోగాలు పెరుగుతాయి.
భారత ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్పు చేసే పని ఇది.
ప్రపంచంలో ఫ్రాన్స్ అమెరికా చైనా ల తరువాత ఇంతటి బృహత్ ప్రయత్నం చేస్తున్నది భారత్ మాత్రమే.
అయితే అణు విద్యుత్ అనగానే చెర్నోబిల్ దుర్ఘటన గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా అకారణ భయాలను నివారించుకోవడానికి ఒకే మార్గం ఉంది.
ఉదాహరణకి అందరూ విమాన ప్రమాదాలకు భయ పడతారు..కానీ అంతకంటే వేల రెట్లు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు.
ప్రమాద శాతం అతి తక్కువ ఉన్న వ్యవస్థ అణు విద్యుత్ వ్యవస్థ కానీ అర్థ రహిత భయాలు ఎక్కువ.
వీటిని పెంచడంలో కమ్యూనిస్టులు ముందుంటారు.
ఏ దేశం అభివృద్ధిని అయినా అడ్డుకోవాలంటే వీళ్ళే ముందు. ఎందుకు అంటే అభివృద్ధి నిరోధకత అనేది ఒక మానసిక జబ్బు…అది వాళ్ళకి జన్మతః వచ్చింది.
ముఖ్యంగా భారత్ ను అడ్డుకోవాలంటే…విదేశీ శక్తుల ప్రేరణతో వీళ్ళు ముందుకు దూకుతారు. ఇప్పుడు రోజూ పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు కథలు..కవితలు అల్లుతారు.
అర్బన్ నక్సల్స్ కి…కొత్తగా వచ్చి చేరిన బ్యాచ్ కి చేతినిండా పని.
అందుకే SHANTI సరిగా ఆవరించాలంటే…వీళ్ళు అంతరించాలి.
ఈలోగా ఖాన్ గ్రేస్ వంటి దేశ వ్యతిరేక శక్తులను వదల గొట్టుకోవాలి.
లేకుంటే…మళ్ళీ ఉపాధి కోసం గుంతలు తవ్వడం, పూడ్చడం వంటి పన్లు మాత్రమే చేసుకుంటూ కాలం గడిపెయ్యాలి
అందుకే ఒక పక్క జీ రామ్ జీ…మరోపక్క సుస్థిర శాంతి.
దేశాన్ని ప్రగతిని సరిగ్గా అర్థం చేసుకుందాం!