-బీజేపీ ఎల్పీ లీడర్ రాజాసింగ్
మేము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అసెంబ్లీలో ఉంటే మా హక్కుల్ని కాలరాస్తూ మా ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలను సస్పెండ్ చేశారు.
మొత్తం సెషన్ అంతా సస్పెండ్ ఈ ముఖ్యమంత్రి రాజకీయ కుట్రలో భాగం.
మహాత్మాగాంధి విగ్రహం దగ్గర నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. మా హక్కును హరించే అవకాశం ఈ సీఎంకు ఎవరిచ్చారు.అసెంబ్లీ మాది, గౌరవ సభ్యులమని కూడా చూడకూండా మమ్మల్ని అసెంబ్లీ ఆవరణ నుంచి పోలీసు ఏవిధంగా అరెస్టు చేస్తారు.మా హక్కుల్ని కాపాడాల్సిన గౌరవ స్పీకర్ కూడా స్పందించకపోవడం దారుణం.
రాజ్యాంగాన్ని మార్చాలన్న ఈ కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభా సంప్రదాయల్ని పాటించకుండా ప్రతిపక్ష శాసన సభ్యుల గొంతు నొక్కుతున్నాడు.పోలీసుల సెక్యూరిటీగా పెట్టుకునే కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడపుతున్నాడు.కేసీఆర్ నయా నిజాం అనుకుంటున్నాడు. నిరంకుశంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.
తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవనీయం… ఈ నయా నిజాం రాజ్యన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం.చావు దగ్గరకొస్తే నక్క నగరంవేపు వెళ్తుందన్నట్లు…. మీ ప్రభుత్వం టై దగ్గరపడింది అందుకే ఇంత నిరంకుషంగా వ్యవహరిస్తున్నారు.