Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు,వారి భవిష్యత్ కి నేడు పండగ దినం

-మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెంప చెళ్ళుమనేలా హై కోర్టు తీర్పు
– 5 కోట్ల తెలుగుప్రజల ఆకాంక్ష అమరావతిని నిలబెట్టిన న్యాయవ్యవస్థకు పాదాభివందనాలు
– ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లకు సిగ్గుంటే, నైతిక విలువలు ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలి
– తెలుగుదేశం పార్టీ నాయకులు

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు, సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తీర్పు వెల్లడించిన నేపథ్యంలో, మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…

ప్రతిపక్షంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిపై 33 వేల ఎకరాలు కావాలని అధికారంలోకి వచ్చి మడమ తిప్పిన జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చి,రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.

అమరావతిని స్మశానం తో పోల్చారు, విధ్వంసకర పరిస్థితులు సృష్టించారు, ఆడవారిని అవమానించారు, అక్రమ కేసులు బనాయించారు, ఎస్సీల పై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు దళిత రైతుల చేతులకు బేడీలు వేయించారు.మా అన్న ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, ఇదే రాజధాని అని ఎలక్షన్ లో గెలిచిన తర్వాత రైతులను అవమానపరిచిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి.

807 రోజుల రైతుల త్యాగం, కష్టం, పడిన బాధలకు… ఫలితం నేడు హైకోర్టు వెల్లడించిన తీర్పు జగన్ రెడ్డి దుర్మార్గమైన చర్యలకు ఈ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, అసువులు బాశారు.మూర్ఖపు ముఖ్యమంత్రి రెడ్డి తన మూర్ఖపు నిర్ణయాలతో ఇబ్బంది పెడుతున్నారు. న్యాయస్థానానికి న్యాయవ్యవస్థ కి రైతుల తరపున ధన్యవాదాలు, వందనములు. జగన్ రెడ్డి చెంప చెల్లుమనే లా నేడు హై కోర్టు తీర్పు,ముఖ్యమంత్రికి సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలి.

రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేసి, అమరావతి పై మడమ తిప్పి, దళిత రైతులపై యస్సీ ఎస్టీ కేసులు పెట్టించి, వారి చేతికి బేడీలు వేయించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి నైతిక విలువలు ఉంటే హైకోర్టు తీర్పును అనుసరించి రాజీనామా చేయాలి. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు, దళిత జేఏసీ నాయకులు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE