Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే

-బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం.. దీనిపై సమగ్ర దర్యాప్తు
-బుడమేరు, పోలవరం మట్టి దోచేశారు.. అందుకే ఈ పరిస్థితులు
-చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది
-53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు
-గత ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రజానీకం అంతా కన్నీరు పెట్టుకుంది
-ఇదే సెప్టెంబర్ 9న ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారు
-వరద బాధితుల రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు
– రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే…

* గత ఏడాది ఇదే సెప్టెంబర్ 9 సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు.
* కానీ ప్రజలు పట్టిన బ్రహ్మరథంతో నేడు వారి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.
* పండగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు.
* 9 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం.
* యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు.
* గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు.
* బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది.
* విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి సీఎం సహాయక చర్యలు చేపడుతుంటే విమర్శలు చేస్తున్నారు.
* ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారు.
* ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయి.
* చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు.
* విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం.
* బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారు.
* దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు.

LEAVE A RESPONSE