హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.