గుడివాడలో పెద్ద మొత్తంలో కొడాలి నాని అనుచరుడి ఇంటిలో చీరల బండిల్స్‌ను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వాటిని సిద్ధంగా ఉంచినట్లు సమాచా రం. పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు ఎస్‌ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ దాడి జరిగింది. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చిన ట్లు గుర్తించారు. 175 నియోజకవర్గాలలో చీరలు పంపిణీ జరిగేందుకు వాటిని ఇక్కడ డంప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.