Home » మరీ ఇంత నిర్లక్ష్యమా?

మరీ ఇంత నిర్లక్ష్యమా?

-అంబేద్కర్ భవన్ ను శిథిలావస్థకు చేర్చారు
-కోట్లు వెచ్చించి పార్టీ కార్యాలయం కట్టుకున్నారు
-మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం
-ప్రతిపాదనలు సిద్దం చేయండి
-ఎస్సీ వెల్ఫేర్ శాఖ డీడీకి
-మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు

మచిలీపట్నం: ప్రజావసరాలను పక్కన పెట్టి.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి విలాసవంత భవనాన్ని కట్టుకున్నారని వైసీపీపై మచిలీపట్నం దళిత జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో… గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిల భవనంగా మారిన మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లోని అంబేద్కర్ భవన్ ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం సందర్శించారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని పలు దళిత సంఘాల ప్రతినిథులతో కలిసి శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవనాన్ని సందర్శించారు. గత పాలకులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితుల కోసం అంబేద్కర్ భవన నిర్మాణాన్ని చేపట్టగా ఆ తర్వాత నిర్వహణ లోపానికి గురైందన్నారు.

2014లో అంబేద్కర్ భవన మరమ్మత్తులకు పూనుకోగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ భవనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గత ఐదేళ్లుగా మూతబడిందన్నారు. అంబేద్కర్ భవన్ పక్కనే కోట్ల రూపాయలతో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణంపై పెట్టిన దృష్టిలో కొంతైనా అంబేద్కర్ భవనంపై చూపలేదని మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం దళిత సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే అంబేద్కర్ భవన్ స్థానంలో ఆధునాతన సౌకర్యాలతో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలును నిర్మిస్తామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వంపు గడవల చౌదరి, మోటమర్రి బాబా ప్రసాద్, దేవరపల్లి అనిత, మాదివాడ రాము, గుమ్మడి విద్యాసాగర్, మద్దాల కృష్ణ కుమార్, గురక బాలాజీ, చిత్తూరు యువరాజ్, చిన్న శేఖర్, పాల్గొన్నారు

Leave a Reply