Suryaa.co.in

Andhra Pradesh

పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉద్యోగసంఘాల ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.గురువారం విజయవాడలోని బీఆర్టీయస్ రోడ్ లో ర్యాలీ, సభ నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఉద్యోగ సంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ర్యాలీ, సభ నిర్వహించ తలపెట్టిన బీఆర్టీయస్ రోడ్ లో పోలీసులు ఆంక్షలు విధించారు.ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో వాహనాలను నిషేధించిన పోలీసులు.. ఆమేరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు ప్రకటించారు.

సింగ్ నగర్, వాంబే కాలనీ, కండ్రిక, నున్న వైపు నుండి BRTS రోడ్డు ద్వారా నగరంలోకి వచ్చే వాహనదారులు.. బుడమేరు మీదుగా ప్రభాస్ కాలేజ్, ఏలూరు లాకులు మీదుగా దారి మళ్లించారు. దేవి నగర్, మధురానగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం నుండి BRTS రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, గవర్నమెంట్ ప్రెస్ మీదుగా సత్యనారాయణపురం పాత పోలీస్ స్టేషన్ మీదుగా ఏలూరు లాకులు మీదుగా సిటీలోకి వెళ్లాలని పోలీసులు సూచించారు. రామవరప్పాడు, గుణదల వైపు నుండి వచ్చే వాహనదారులు, పడవలరేవు నుండి ఏలూరు రోడ్ మీదుగా నగరంలోకి వెళ్లాలని సూచించారు
అదే విధంగా గాంధీనగర్, పెజ్జోనిపేట కేదారేశ్వర పేట , అయోధ్యనగర్ వైపు నుండి బి.ఆర్.టి.ఎస్ . రోడ్డు మీదుగా సింగ్ నగర్ , నున్న వెళ్ళు వాహనదారులు సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని నగర పోలీసులు సూచించారు. వన్ టౌన్ , టూ టౌన్ , భవానిపురం , గొల్లపూడి , ఇబ్రహీంపట్నం వైపు నుండి వచ్చే వాహనదారులు యర్రకట్ట, FCI మీదుగా నగరంలోకి వెళ్ళాలి. వన్ టౌన్, టూ టౌన్ , భవానిపురం , గొల్లపూడి , ఇబ్రహీంపట్నం , వైపు నుండి వచ్చే వాహనదారులు, సింగ్ నగర్ మరియు నున్న వైపు వెళ్లేందుకు యర్రకట్ట మీదుగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని విజయవాడ పోలీసులు సూచించారు.

LEAVE A RESPONSE