Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లిలో దారుణ ఘటన

– డబ్బులు అప్పు ఇచ్చి ఇళ్లకు తాళాలు వేస్తున్న రౌడీ షీటర్
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాటకు అప్పు ఇచ్చి ఇంటికాయితాలు తీసుకొని ఇంటినుంచి బయటకు గెంటివేశారంటూ ఆరోపిస్తున్న బాధితులు చెదల సాయి గోపి, వెంకటరమణ.గత వారం రోజుల కిందట రౌడీ షీటర్ శంకర్, మేడ్చల్ దుర్గారావు, రుద్ర మూర్తి పలువురు ఇంటిపైకివచ్చి తాళాలు వేసి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.అర్బన్ ఎస్పీ గ్రీవిన్స్ కు పిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులు.తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న రామకృష్ణ అనే కానిస్టేబుల్ రాజకీయ వత్తిడి పేరుతో బాధితులను తీవ్ర మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.పోలీస్ కానిస్టేబుల్ రామకృష్ణ, రౌడీ షీటర్ శంకర్ కు అనుకూలంగా వుంటూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అర్బన్ ఎస్పీ కి పిర్యాదు చేస్తూన్నారు. చెప్పిన మాట వినకపోతే చంపుతామని రౌడీ షీటర్ బెదిరుస్తున్నారని ,తమకు తగు రక్షణ కల్పించాలని బాధితులు వేడుకొంటున్నారు.

LEAVE A RESPONSE