విజయవాడ: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మందిని బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. కమిషనర్ల బదిలీపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలువురు కమిషనర్లను మాతృశాఖకు సర్కార్ బదిలీ చేసింది. మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
1. నెల్లిమర్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉన్న పి. బాలాజీ ప్రసాద్ ను ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ గా నియామకం
2. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో సెక్రటరీ గా ఉన్న పి. నల్లనయ్యను విజయనగరం మున్సిపల్ కమిషనర్ గా నియామకం
3. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో సూపరింటెండెంట్ జె.సురేంద్ర ను నర్శిపట్నం మున్సిపల్ కమిషనర్ గా నియమించారు
4. భీమవరం మునిసిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ ఎ.శ్రీవిద్య సామర్లకోట మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు
5. కె.వి.వి.ఆర్.రాజును అమలాపురం మున్సిపల్ కమిషనర్ గా నియమించారు
6. వినుకొండ మున్సిపల్ కమిషనర్ టి.ఎల్.పి.ఎస్.ఎస్. కృష్ణవేణిని నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గా
7. ఆదోని మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డిని భీమవరం కమిషనర్ గా
8. ఎ.భాను ప్రతాప్ ను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా
9. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ ఇ.వి.రమణబాబును నందిగామ మున్సిపల్ కమిషనర్ గా
10. పొదిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖర్ రెడ్డిని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ గా
11. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్ బాబును పొన్నూరు కమిషనర్ గా
12. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కె.చెన్నయ్యను గురజాల మున్సిపల్ కమిషనర్ గా
13. సత్తెనపల్లి మునిసిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పని చేస్తున్న ఎం.వి.అప్పారావును దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ గా
14. పిడుగురాళ్ళ మునిసిపాలిటీలో రెవెన్యూ అధికారిగా ఉన్న పి.శ్రీధర్ ను అదే మునిసిపాలిటీలో కమిషనర్ గా
15. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఎం.సుభాష్ చంద్రబోస్ ను వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా
16. నరసాపురం మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావును ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా
17. మాచర్ల మున్సిపాలిటీలో మేనేజర్ గా పని చేస్తున్న డి. వెంకటదాస్ ను గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ గా
18. తెనాలి మునిసిపాలిటీ లో అసిస్టెంట్ కమిషనర్ కె.అనూషను కందుకూరు మున్సిపాలిటీ కమిషనర్ గా
19. ముమ్మడివరం కమిషనర్ కె.వెంకటరామిరెడ్డిని ఆళ్లగడ్డ కమిషనర్ గా
20. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో జోనల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ ను తాడిపత్రి కమిషనర్ గా
21. కర్నూలు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ వి.దివాకర్ రెడ్డిని రాయదుర్గం కమిషనర్ గా
22. పెనుకొండ కమిషనర్ ఎస్.వంశీకృష్ణ భార్గవను కళ్యాణదుర్గం కమిషనర్ గా
23. చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలో పని చేస్తున్న వి.వి.నరసింహారెడ్డిని బద్వేలు కమిషనర్ గా
24. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న ఎం.గోపాలరావును పెడన కమిషనర్ గా నియమించారు.