Suryaa.co.in

Andhra Pradesh

గర్భిణీని భుజాలపై ఆసుపత్రికి తరలింపు.. మార్గమధ్యంలో మృతి

రోడ్డు లేదు.. అంబులెన్సు రాదు
కొయ్యూరు మండలం కంబూరు గ్రామప్రజల చావుబతుకుల పోరాటం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ కొన్నిచోట్ల నిరుపేదలు వైద్యం అందక మృతి చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఏపీలోని అల్లూరు జిల్లాలో జరిగింది. కొయ్యూరు మండలం కంబుర్లకు చెందిన పాంగి రోజా పురిటి నొప్పులతో బాధ పడుతుండగా, ఆ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్సు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్ట్రెచర్ మీద భుజాలపై ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది.

ఇలాంటి విషాద మరణాలు అక్కడి గిరిజనాలకు అలవాటుగా మారాయి. డోలీ కట్టుకుని, రోగులను మంచం మీదనే పడుకోబెట్టి, మండల కేంద్రాలకు చేరేలోపే.. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న తండాల బతుకులపై, పాలకుల నిర్లక్ష్యానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు అద్భుతం.. అనిర్వచనీయం.. అనన్యసామాన్యమని, తమ భుజాలు తామే చరుచుకుంటున్న మంత్రులు, అధికారుల భజనలో ఎంత నిజం ఉందో చెప్పడానికి ఈ దృశ్యం ఒక్కటి చాలు!

LEAVE A RESPONSE