పర్యావరణ పరిరక్షణ లో వృక్షాలు కీలక పాత్ర
ఉద్యమంగా మొక్కల పెంపకం
– బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు లో భాగంగా ..అమ్మ పేరు తో ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మొక్క నాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర ప్రధాన సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో వృక్షాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కల పెంపకం ద్వారా మన ఆరోగ్యం మనమే సంరక్షించుకున్న వారిమవుతామని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని కోరారు.
మొక్కలు నాటే కార్యక్రమానికి ఇంఛార్జి గా ఉన్న బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
బిజెపి శ్రేణులు తో పాటు విద్యార్థులు,స్వచ్చంద సంస్థలు సహకారం తో వేలాది మొక్కలు నాటుతన్నామన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ పేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ ,రాష్ట్ర లీగల్ సెల్ ప్రముఖు మల్లికార్జున మూర్తి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు