నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో మంది పేదలకు సహాయ పడిన వ్యక్తి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, మంచాల సనత్ కుమార్ సైకత శిల్పంను ట్రిబ్యూట్ టు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటూ సైకత నివాళిని తెలిపాడు. ఆ కళాకృతిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.