– రాజ్యసభ ఛైర్మన్,లోకసభ స్పీకర్ లను కలిసిన ఎంపీలు
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాల్సిందిగా ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్, లోకసభ స్పీకర్ లను కలిశారు.పార్లమెంటులో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావుల నాయకత్వంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,జోగినపల్లి సంతోష్ కుమార్,కే.ఆర్.సురేష్ రెడ్డి,లోకసభ సభ్యులు బీ.బీ.పాటిల్ తదితరులు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్,లోకసభ స్పీకర్ ఓంబిర్లాలను వారి ఛాంబర్లలో కలిసి ఈ మేరకు లేఖలు అందజేశారు.