– భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు
-అడ్డం తిరిగిన అగ్ర కంపెనీలు
– భారత్ ఆర్ధిక వ్యవస్థకు బాసట
– భారత ఆర్థిక వ్యవస్థ ప్రతిష్ఠాత్మకంగా ఉంది
– వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి
– చాట్‌జీపీటీ, గ్రోక్, జెమిని, మెటా ఏఐ, కోపైలట్ సమర్ధన
భారత్ ఆర్ధిక వ్యవస్థపై నోరుపారేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత దేశంలోనే ఎదురుదెబ్బతగిలింది. భారత్‌ది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సొంత దేశంలోనే అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఖండించాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని స్పష్టం చేశాయి.
భారత దిగుమతులపై 25 శాతం భారీ సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీటీవీ సంస్థ, అమెరికాకు చెందిన ఐదు ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లైన చాట్‌జీపీటీ, గ్రోక్, జెమిని, మెటా ఏఐ, కోపైలట్లను “భారత్‌ది డెడ్ ఎకానమీయా?” అని ప్రశ్నించింది. దీనికి అవన్నీ ఏకగ్రీవంగా “లేదు” అనే సమాధానం ఇచ్చాయి.
“భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు, చాలా చురుగ్గా, ప్రతిష్ఠాత్మకంగా ఉంది” అని చాట్‌జీపీటీ చెప్పగా, “అసలు ఆ మాటే నిజం కాదు, దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి” అని కోపైలట్ చెప్పింది.
“భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది” అని గ్రోక్ తెలిపింది.
“భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధితో దూసుకెళ్తోంది” అని జెమిని అంది. మెటా ఏఐ కూడా “భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి” అని చెప్పింది. ఇలా అమెరికన్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లన్నీ కూడా ఒకే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలు అబద్ధమని తేల్చేశాయి. దీనితో భారత్ ఆర్ధిక వ్యవస్ధపై నోరుపారేసుకున్న ట్రంప్ ఆత్మరక్షణలో పడినట్లయింది.