వైకాపా నోటికి ప్లాస్టర్ వేసిన ఈడీ!
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అల్లిన అబద్ధపు కథలు ఎప్పుడూ శాశ్వతం కావు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ నిరూపించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బురద చల్లడమే లక్ష్యంగా సాగిన వైకాపా దుష్ప్రచారానికి ఈడీ గట్టి చెంపపెట్టు ఇచ్చింది.
జగన్ కుట్రలు.. బట్టబయలైన నిజాలు
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో, అత్యంత క్రూరంగా కుట్రలు పన్నిన తీరు ఇప్పుడు దేశం ముందు నిలిచింది.
* క్లీన్ చిట్: స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది.
* ఆధారాలు లేవు: ఈ కేసులో చంద్రబాబు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి లబ్ధి పొందలేదని, ఆయన పాత్ర ఎక్కడా లేదని కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ ద్వారా తేలిపోయింది.
* అధికార దుర్వినియోగం: అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేత చంద్రబాబును మనస్తాపానికి గురిచేయాలని చూసిన జగన్ క్రూర మనస్తత్వం ఇప్పుడు బట్టబయలైంది.
అబద్ధాల కోటకు బీటలు
నాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైకాపా నేతలు చేసిన యాగీ అంతా వట్టిదేనని తేలిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా వేలమంది యువతకు నైపుణ్యం అందించాలనే సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని “అవినీతి” అంటూ చిత్రికరించిన వైకాపా నోటికి ఈడీ తాజా నివేదికతో గట్టి ప్లాస్టర్ పడింది.
కోర్టులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్ షీట్, గత ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు సజీవ సాక్ష్యం. నిప్పును ఎంత కాలం దాచలేరో, నిజాన్ని కూడా అంతకాలం అణచివేయలేరని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.