– యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అధ్యక్షతన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కి గ్రూప్ 1 నోటిఫికేషన్సం బంధించినటువంటి అవకతవకలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను ఏదైతే 1:100 ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
అంతేకాకుండా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులను పెంచాలని మరియు నిరుద్యోగ యువతకు ప్రవేశ పరీక్షలకు ఎటువంటి రుసుము తీసుకోమని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని నిరుద్యోగులను మోసం చేశారు అని అన్నారు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అన్నారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల పవన్ రెడ్డి, కుండే గణేష్, డా. బొంగోని సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి, కుమార్ యాదవ్, చిత్తారంజన్ రెడ్డి, అశోక్ ప్యాట, అరవింద్, దయాకర్, శ్రీనాథ్, సుధీంద్ర శర్మ, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.