Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ సిఫార్సు లేఖలు రద్దు

ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1, 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనాలు కేటాయిస్తామని పేర్కొంది. అంతేకాదు జనవరి 11 నుంచి 14 వరకు గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు కొవిడ్ టీకా సర్టిఫికెట్ లేదా..ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

LEAVE A RESPONSE