కామారెడ్డి జిల్లా, లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఒక రైతు పొలంలో ప్లెక్సీలు కట్టడంపై గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీశారు.
ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, సదరు రైతుకు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని, గడువు 9 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అనేక సార్లు కలిసి రుణాన్ని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేసామని, బ్యాంకుకు తనాఖా పెట్టిన భూమిని కూడా ఇతరులకు విక్రయిస్తున్నాడని, ఆ సందర్భముగా అలా పెట్టవలసివచ్చిందని వివరించగా, దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని తెలియజేసారు.