-సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే
హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఇళ్ల స్థలాల కేటాయింపుకు మార్గం సుగమం చేసిన కోసం సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) బాధ్యులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం నాడు న్యూ ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఎన్వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని టీయుడబ్ల్యుజె, ఐజేయూ బాధ్యులను కోరారు. అంతేకాకుండా ఆగష్టు 27న ఎన్వీ రమణ పుట్టిన రోజు కావడంతో టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.