రాష్ట్ర ఐటీ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు వి 6 ఛానెల్ , వెలుగు దినపత్రికను బ్యాన్ చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెదరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది . ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడింది . వి 6 , వెలుగులో బీఆర్ఎస్ పార్టీ , లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలు , చేసిన ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిలకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య , ప్రధాన కార్యదర్శి బి . బసవపున్నయ్య సూచించారు .
కానీ , మీడియా ముఖంగా అల్టీమేటమ్ ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు . ప్రజలు . ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయనే సంగతి అందరికి తెలిసిందేనని గుర్తు చేశారు . ఇష్టారాజ్యంగా మాట్లాడం కేటీఆర్కు శోభనివ్వదని పేర్కొన్నారు . మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లు , మూక దాడులపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కేటీఆర్ ఖండించడాన్ని స్వాగస్తున్నట్టు చెప్పారు .
పరిణితి చెందిన ప్రజానాయకుడిగా ఆయన చొరవను అభినందిస్తున్నట్టు వివరించారు. సమాజం కోసమే. మీడియాకు పనిచేస్తుందనీ , అందుకే రాజ్యాంగం మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించిందని వివరించారు . రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి చట్ట ప్రకారం , ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న పత్రిక , ఛానెల్పై విమర్శలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు . అలాగే ప్రభుత్వాలు విమర్శను స్వాగతించాలనీ, ఆమేరకు సర్కారులో ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం ఉ ండాలని కోరారు . రెండు రోజుల్లో పత్రికలు, ఛానెళ్లు విమర్శలు చేస్తూనే , మంచిని ప్రోత్సహించాలని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు వి 6 , వెలుగుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు . లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు . ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు .