(సూరజ్ భరద్వాజ్)
ఆకాశంలో ఇవాళ అద్భుతం జరగబోతోంది. అందరి మనసులు దోచేసే ఆ చందమామ ఇవాళ మినీమూన్ గా పిలవబడే మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. ఇది ఒక గ్రహశకలం అనీ, అది భూమిని ఢీకొట్టదని నాసా నిర్ధారించింది.
సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి ఈ మినీమూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 350000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3476 కి.మీ. కాగా, మిని చంద్రుడి వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. అర్ధరాత్రి 1 గం. 30 ని. ల తర్వాత చంద్రుని పక్కనే మరో మినీ చంద్రుడిని టెలిస్కోప్ లో వీక్షించవచ్చు.
రాబోయే రెండు నెలలపాటు చంద్రుని చుట్టూ చిట్టి చందమామ ప్రదక్షిణం చేయనున్నాడు. భూమికి ఉన్న సహజ ఉపగ్రహం చంద్రుడు మాత్రమే! ఐతే, ఈ చంద్రునికి ఉపగ్రహంగా ఓ గ్రహశకలం రెండు నెల్లపాటు పరిభ్రమించనుంది.