Suryaa.co.in

Andhra Pradesh

అనధికార నిల్వలు,కృత్రిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు

– వంట నూనెలను ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి..
– రాష్ట్ర వ్యాప్తంగా అకస్మిక తనీఖీలు నిర్వహించాలని విజెలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను ఆదేశించిన మంత్రి
– అనధికార నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు‌ చేయాలి..
– మండలాల వారీ రిపోర్ట్స్ తీసుకొని రేట్లను పరిశీలించాలి…
-పౌరసరఫరాల శాఖ ద్వారా మనం సామన్య ప్రజలకు అండగా ఉండాలి…
పౌరసరఫరాల శాఖ మరియు‌ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

వంటనూనెల ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ మరియు కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల కార్పొరేషన్ విసి&ఎండి వీరపాండ్యన్, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మ్ంట్ డిజి ఎస్.బి.బాగ్చీ పాల్గొన్న ఈ సమావేశంలో ధరల నియంత్రణ, పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాడ్లాడుతూ…నిత్యవసర సరుకులను , ముఖ్యంగా వంట నూనెలను నిర్ధేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసిన బైండోవర్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు… సామాన్య ప్రజలకు వంటనూనెలు, నిత్యవసర సరకుల ధరల విషయంలో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకునే బాధ్యత మన మీదా ఉందని…దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రైతు బజారులు, మున్సిపల్ మార్కెట్‌ల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు వంటనూనెలు అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందిస్తున్న రిపోర్ట్స్ ఆధారంగా మండలాల వారిగా ఉన్న వంటనూనె రెట్లను ఎప్పటికీ అప్పుడు అధికారులు పరిశీలించాలని , క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు అర్ధం చేసుకొని , నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు..ఎక్కడ కూడా అధికారులు సామన్య ప్రజలకు మేలు జరిగే విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని అన్నారు…

ప్రముఖ బ్రాండ్ ల తయారీ ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించాలని, ఇంపోటర్స్, సప్లైయర్స్ తో సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.. లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష కూడా ఇదే నని కాబట్టి అధికారులు తీసుకునే చర్యలు ద్వారా సత్ఫలితాలు ఇచ్చి ధరలు పెరగకుండా నియత్రించగలిగాలని మంత్రి తెలిపారు.

సమీక్షలో పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & ఎండి వీరపాండ్యన్, రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, ఎక్స్ ఆఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ డా. షoకబ్రత బాగ్చి , మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన రెడ్డి,లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిపోర్ కుమార్,రైతుబజార్ సీఈఓ శ్రీనివాస రావు, ఏపి ఆయిల్ ఫెడ్ వైస్ చైర్మన్ & ఎండి సి.బాబు రావు తదితరులు పాల్గొన్నారు…

LEAVE A RESPONSE