– టోల్ చార్జీలు పెంపుతో మరింత అదనపు భారం పడుతుంది
-రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా టోల్ చార్జీలు భరించాలి
– టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 5 శాతం పెంచనున్న టోల్ చార్జీలతో వాహనదారులపై తీవ్ర భారం పడుతుంది.ఇప్పటికే వైసీపీ పాలనలో పెరిగిన, డీజిల్, పెట్రోల్ ధరలతో వాహనదారులు, ముఖ్యంగా లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టోల్ చార్జీల పెంపుతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా వారిపై మరింత అదనపు భారం పడుతుంది. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువులు, గ్యాస్ , పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు భారీ పెరిగిపోయి సామాన్యులు బ్రతికలేని పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు టోల్ చార్జీలు పెంపుతో మళ్లీ నిత్యవసర ధరలు భారీగా పెరిగే అవకాశముంది. దీంతో సామాన్య ప్రజల జీవితాలు చిన్నాబిన్నం అవుతాయి. కాబట్టి లారీ యజమానులు, వాహనదారులపై భారం పడకుండా కేంద్రం పెంచనున్న టోల్ చార్జీలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.