– అన్ని వర్గాల నుంచి ఊహించని ఆదరణ
– వారం క్రితమే కోటికి పైగా సంతకాలు, ఇంకా వస్తూనే ఉన్నాయి
– వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా పనిచేయాలి
– పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి
– జూమ్ కాన్ఫరెన్స్‌లో వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ వచ్చింది, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా జరిగింది. అనుకున్న సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి సంతకాలు వస్తున్నాయి. ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాలు, 13న జిల్లా స్ధాయిలో, 16 సాయంత్రం గవర్నర్ దగ్గరకు వెళుతున్నామని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమాల్లో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. మండల స్థాయి వరకూ అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. నియోజకవర్గ స్ధాయి, జిల్లా స్థాయిలో మీరంతా ఫోకస్‌గా పనిచేయాలి. కోటి సంతకాల సేకరణ ఇంత పకడ్బందీగా ఎన్నడూ జరగలేదు. ఈ సారి మన పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఒక మోడల్ గా రెడీ చేసింది. ప్రజల అభిప్రాయాన్ని మనం స్పష్టంగా చూపగలగాలి, భవిష్యత్ తరాలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన నష్టాన్ని చెప్పగలిగాం, ఇది హిస్టరీలో నిలిచిపోయేలా మనం సిద్దం చేయాలి. ఇవన్నీ డిజిటలైజేషన్ చేయాలి, దీనికి అవసరమైన సహకారం పార్టీ నుంచి ఉంటుంది.
పార్లమెంట్ పరిశీలకులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ కార్యక్రమాలన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ అవ్వాలి. పార్టీ అనుబంధ విభాగాలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలి. ప్రతి జిల్లాలో జరిగే ర్యాలీలు 10 వేల మందికి పైగా క్యాడర్ తో జరగాలి. 13న రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమ హడావుడే ఉండాలి. గత వారం వరకే కోటికి పైగా సంతకాలు దాటాయని సమాచారం వస్తుంది. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయన్నారు.
పార్టీ నాయకులందరి మధ్య సమన్వయం ఉండాలి. అనుబంధ విభాగాలు మరింత చొరవగా పనిచేయగలగాలి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అధినేత జగన్ కూడా ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన చేస్తున్న యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యం అవ్వాలనే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలి. అందరూ చిత్తశుద్దితో పనిచేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ వారం రోజులు మీ ద్యాస, దృష్టి అంతా దీనిపైనే ఉండాలి