Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర బడ్జెట్ 2024: ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,000 కోట్లు

-అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం, రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్ల భారీ నిధులను కేటాయించింది. బడ్జెట్‌ లో పలు కీలక రంగాలకు భారీ నిధులు కేటాయించింది.

  • అమరావతి అభివృద్ధి: రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, కేంద్రం రూ. 15,000 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అవసరాలకు అనుగుణంగా మరింత నిధులు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది.
  • పోలవరం ప్రాజెక్ట్: ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి కేంద్రం సహాయం చేస్తుంది.  అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తుంది.
  • వెనుకబడిన ప్రాంతాలు: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో సహా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది.
  • మౌలిక సదుపాయాలు: నీటి వసతులు, విద్యుత్, రైల్వేలు, రోడ్ల రంగాలలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలుస్తుంది.
  • ఎంఎస్‌ఎంఈలు: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEలు) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించబడింది. వీటికి క్రెడిట్ గ్యారెంట్ స్కీం ద్వారా సులభంగా రుణాలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచడం జరిగింది.
  • ఆహార భద్రత: 100 కొత్త ఫుడ్ క్వాలిటీ ల్యాబ్‌ల ఏర్పాటుతో పాటు, 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాలలో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
  • ఇతరాలు: ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకులు, 100 కొత్త పారిశ్రామిక పార్కులు, క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు తో పాటు అనేక ఇతర కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం జరిగింది.

ఈ కేటాయింపులు రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులకు ఊపునిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా, అమరావతి అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడం రాష్ట్ర రాజధాని యొక్క దీర్ఘకాలిక దృష్టిని సాకారం చేయడంలో సహాయపడుతుందని.., రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

LEAVE A RESPONSE